వీడియో: ‘ప్లీజ్, పని చేయనివ్వండి, లేదంటే నా జాబ్ పోతుంది’, లబోదిబోమన్న రోబో..!
TeluguStop.com
టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందడం, ఆటోమేషన్‌పై కంపెనీలు బాగా ఆధారపడటం వల్ల మనుషులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు.
ఇప్పటికే రోబోలు చాలామంది ఉద్యోగాలను లాగేసుకున్నాయి.ముఖ్యంగా రెస్టారెంట్లలో రోబో సర్వర్లు పెరిగిపోతున్నాయి.
వీటి వల్ల జాబ్ ఎక్కడ పోతుందేమోనని ఇప్పుడు మానవ ఉద్యోగులు భయపడిపోతున్నారు.అయితే ఈ భయం మానవులకే కాదు రోబో( Robots )లకు కూడా ఉంటుందని ఒక వైరల్ వీడియో చెప్పకనే చెబుతోంది.
వైరల్ వీడియోలో కనిపించిన ఒక రోబో తన పనికి అంతరాయం కలిగించిన కస్టమర్లను ఉద్దేశించి "అయ్యో నా జాబ్ పోతుంది" అంటూ లబోదిబోమని అరిచింది.
"""/" /
ఆ రోబో పేరు పీనట్.అది యూఎస్ దేశం, ఓర్లాండో( Orlando ) సిటీలో హాట్ పాట్ అనే చైనీస్ రెస్టారెంట్‌లో ఉద్యోగం చేస్తోంది.
రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్లను వారి టేబుల్ వద్ద కూర్చోబెట్టే పనిని యజమానిని దీనికి అప్పచెప్పాడు.
అయితే ఇటీవల రెస్టారెంట్ కి వెళ్లిన కస్టమర్లకు ఇది బాగా నచ్చేసింది.కాగా దానిని దారికి కస్టమర్లు అడ్డు వస్తే అది "డోంట్ బ్లాక్ మై వే, నేను పని చేయాలి.
లేదంటే నా జాబ్ పోతుంది" అని క్యూట్‌గా చెబుతూ ఆశ్చర్యపరిచింది.చిన్నపిల్లల గొంతుతో చాలా పెద్దగా రోబో ఈ మాటలు పలకడం విని కస్టమర్లకు బాగా ముచ్చటేసింది.
"""/" /
దాంతో దానిని వారు వీడియో తీసి సోషల్ మీడియా(Social Media )లో షేర్ చేశారు.
అది కాస్త ఇప్పుడు విస్తృతంగా చక్కెర్లు కొడుతోంది.దీన్ని చూసి నేను అయ్యో పాపం రోబోలకి కూడా జాబ్ సెక్యూరిటీ లేదా అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
@uncovering_ai ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన ఈ ఫన్నీ వీడియోని మీరు కూడా చూసేయండి.
జపాన్ లో ఆ తేదీన రిలీజ్ కానున్న దేవర.. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా?