సైకిల్ తొక్కిన పవన్ కళ్యాణ్ వీడియో వైరల్..!!

ఏపీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) విస్తృతంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

సోమవారం తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ( Tadepalligudem, Unguthuru ) నియోజకవర్గాలలో బహిరంగ సభలలో పాల్గొనాలని సిద్ధపడ్డారు.

కానీ హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో.సాంకేతిక లోపం తలెత్తింది.

దీంతో సోమవారం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ క్యాన్సిల్ అయింది.పరిస్థితి ఇలా ఉండగా హెలిపాడ్ నుంచి పవన్ బయటకు వస్తుండగా.

జనసేన తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పలువురిని పరామర్శించారు. """/" / ఈ క్రమంలో పవన్ అభిమాని ఓ వ్యక్తి పిఠాపురంలో( Pithapuram ) గత కొద్దిరోజులుగా సైకిల్ పై పవన్ ఆశయాలు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు.

ఆ వ్యక్తిని పవన్ కలవడం జరిగింది.ఎన్నికలలో కూటమి గెలిస్తే.

చేపట్టే కార్యక్రమాలపై అతను అవగాహన కల్పిస్తున్న తీరును పవన్ అడిగి తెలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా సైకిల్ తోకి పవన్ ఆ వ్యక్తిని ఉత్సాహపరిచారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాను ఎంతగానో అభిమానించే నాయకుడు స్వయంగా వచ్చి కలవటం.తన సైకిల్ తొక్కటంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడు వారాలు మాత్రమే సమయం ఉంది.దీంతో పవన్ రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులు గెలుపు కోసం.

విస్తృతంగా పర్యటిస్తున్నారు.కచ్చితంగా ఈసారి పిఠాపురం నుంచి గెలవాలని.

భావిస్తున్నారు.

పార్లమెంట్‌లో తప్పుడు సాక్ష్యం .. సింగపూర్‌లో దోషిగా తేలిన భారత సంతతి నేత