సిలిండర్ నుంచి ఎగిసిపడ్డ మంటలు.. ధైర్యంగా ఆర్పేసిన యువకుడు..

భారతదేశంలోనో లేదా ప్రపంచంలోని మరెక్కడైనా, అగ్ని ప్రమాదం( Fire Accident ) జరిగితే ఎంతో నష్టం వాటిల్లుతుంది.

ముఖ్యంగా మార్కెట్లలో తలెత్తితే చాలా ఆస్తి నష్టం జరగవచ్చు.చాలా మందికి ప్రాణాంతకం కూడా కావచ్చు.

ఇక మంటలు ఎగజిమ్ముతున్న గ్యాస్ సిలిండర్( Gas Cylinder ) దగ్గరి ఎవరూ వెళ్లలేరు.

అలాంటి పరిస్థితిలో అగ్నిని ఆర్పే సాహసం, ధైర్యం ఎవరూ చేయలేరు.కానీ రీసెంట్‌గా ఒక యువకుడు అందరి భావన రాంగ్ అని ప్రూవ్ చేశాడు.

అతడు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న ఓ గ్యాస్ సిలిండర్ ని ఆర్పేశాడు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది, నెటిజన్లు దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.

రాజస్థాన్‌లోని( Rajasthan ) ఉదయపూర్‌కు చెందిన ఓ ఇన్‌స్టా యూజర్ ఈ బ్రేవ్ బాయ్ వీడియో షేర్ చేశాడు.

ఈ అకౌంట్ తరచుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫైర్ యాక్సిడెంట్స్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటుంది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో, గ్యాస్ సిలిండర్ కు మంటలు అంటుకుంటున్నట్లు చూడవచ్చు.

సిలిండర్ నుంచి మంటలు ఒక్కసారిగా చాలా ఎత్తుకు ఎగిసి పడ్డాయి.దాంతో ప్రజలు తలో దిక్కు పరుగులు తీయడం ప్రారంభించడంతో వారిలో భారీ ఆందోళన కలుగుతుంది.

ఈ అగ్ని చాలా ప్రమాదకరంగా కనిపించింది. """/" / ఇంతలో, ఒక యువకుడు వచ్చి అగ్నిని ఆర్పడటానికి ప్రయత్నించాడు.

మరొకరి సహాయంతో అతను ఆ అగ్నిని ఆర్పడటానికి ట్రై చేయడం వీడియోలో చూడవచ్చు.

ఈ ప్రక్రియలో గాయపడినా, ఆ వ్యక్తి తన ప్రయత్నాలను కొనసాగించాడు.చివరికి ఎలాగోలా సిలిండర్ నాబ్‌ను ఆపివేశాడు.

మరే ఇతర నష్టం జరగకుండా మంటను విజయవంతంగా ఆర్పివేశాడు.స్థానిక ప్రజలు ఆ వ్యక్తి ధైర్యాన్ని, సిలిండర్‌ను ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తున్న తీరును చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.

అతడు గ్యాస్ విజయవంతంగా ఆర్పివేసిన తర్వాత, ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ యువకుడిని ప్రశంసించారు.

"""/" / వీడియో పోస్ట్ చేసిన వెంటనే వైరల్( Viral ) అయింది.

దాన్ని 41 లక్షలకు పైగా మంది చూశారు.4 లక్షలకు పైగా మంది లైక్ చేశారు.

వేలాది మంది యూజర్లు వీడియోపై కామెంట్ చేశారు.ఒక యూజర్, "మీలాంటి ధైర్యవంతులు ఉండటం చాలా అవసరం, అన్నయ్య, గ్రేట్ జాబ్," అని కామెంట్ చేశారు.

మరొక యూజర్, "అతని ముఖంలోని నమ్మకం, ప్రశాంతత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.అభినందనీయమైన పని చేశారు.

మీరు అక్కడ చాలా మందిని కాపాడారు" అని కామెంట్ చేశారు."ఆ అన్నయ్య ముఖం వెలిగిపోతున్న తీరు చూస్తే అతనికి ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉందో తెలుస్తుంది" అని ఇతరులు కామెంట్ చేశారు.

కెమెరాలో చిక్కిన సీక్రెట్ మూమెంట్.. మెలానియా ట్రంప్‌కు గవర్నర్ ముద్దు.. వీడియో వైరల్..