ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో ఆంటీ, అంకుల్ మధ్య గొడవ వీడియో.. చూస్తే నవ్వే నవ్వు…
TeluguStop.com
ఢిల్లీ మెట్రో ట్రైన్లు( Delhi Metro Trains ) ప్రయాణాలకు మాత్రమే కాదు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ నుంచి పిడిగుద్దుల ఫైట్ల వరకు చాలా వింతలకు వేదికగా నిలుస్తున్నాయి.
ఢిల్లీ వాసులు మెట్రో ట్రైన్స్ లో ఇంకా ఎన్నో చిత్రాలు చూసి నోరెళ్లబెట్టాల్సి వస్తోంది.
ఇక సీటు విషయంలో ప్రయాణికులు పడుతున్న గొడవ చూస్తే ఒక్కోసారి భయం, ఇంకొకసారి జాలి, మరోసారి నవ్వొస్తోంది.
తాజాగా నవ్వించే ఒక వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఢిల్లీ మెట్రో ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఒక ఆంటీ అంకుల్ తో మహిళల రిజర్వ్‌డ్ సీటు విషయంలో గొడవ పడటం కనిపించింది.
"""/" /
వైరల్ వీడియో ప్రకారం, మహిళలకు రిజర్వ్ చేయబడిన సీటును ఖాళీ చేయమని ఆంటీ కోరింది, కానీ అంకుల్ నిరాకరించాడు.
ఇద్దరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు, కోచ్‌లోని ఇతర ప్రయాణికులు నిశ్శబ్దంగా కూర్చున్నారు.ఆంటీ కి మరొక ఆమె మద్దతు తెలుపుతూ అంకుల్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా మీరు వీడియోలో గమనించవచ్చు.
ఈ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ఈ గొడవను వీడియో తీశారు.
దానిని రెడిట్ లో టోటల్ కాళేష్ ( Kalesh )అనే ఒక యూజర్ షేర్ చేశాడు.
"""/" /
అప్పటినుంచి ఈ వీడియో వైరల్‌గా మారింది.సోషల్ మీడియాలో ఈ సంఘటనపై ప్రజలు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఢిల్లీ మెట్రోలో ఇది మామూలే అని కొందరు, సీటు విషయంలో సీన్ క్రియేట్ చేశారని మరికొందరు విమర్శించారు.
మెట్రోలో కొట్లాటలు, వాదనలు పెరుగుతున్నాయంటూ కొందరు జోకులు కూడా వేశారు.
ముంబైలో టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడిన రిషి సునాక్ .. ఇంటర్నెట్ షేక్