వీడియో వైరల్: ఈ రోబో కుక్కలు ఎంత బాగా డాన్స్ చేస్తున్నాయో కదా..

ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదోరకమైన కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తూనే ఉంటుంది.ప్రస్తుత రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ వాడకం మరింతగా పెరిగింది.

చేసే పనులు చాలా త్వరగా అలాగే కచ్చితత్వంతో కూడిన విధంగా పనిచేయడం ద్వారా కృత్తిమ మేధస్సును( AI ) ప్రతి పనిలో ఉపయోగించడానికి కంపెనీలు ఉత్సాహం చూపిస్తున్నాయి.

ఇదివరకు రోబోల పేరు చెప్పగానే అది చిన్నచిన్న అడుగులు వేసుకుంటూ కదిలే మర యంత్రాలు లాగా మనకు కనిపించేవి.

కూర్చోవడం, లేవడం అంటే చిన్న చిన్న టాస్కులు మాత్రం చేయగలడానికి అవి ఉపయోగపడేది.

కాలం గడిచేకొద్దీ టెక్నాలజీ కూడా మారడంతో ఏకంగా రోబోలు డాన్స్( Robot Dance ) చేసే స్థాయికి వచ్చేసాయి.

"""/" / అమెరికా దేశానికి చెందిన బోస్టన్ డైనమిక్స్( Boston Dynamics ) అనే కంపెనీ కుక్కల ఆకారంలో చేసిన రెండు రోబోల డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ కలలు, వినోదం, రోబోటిక్స్ నేలవింపుగా ఈ వీడియోని అభిమానించింది కంపెనీ.

ఇందుకుగాను మా స్పాట్ మరో విచిత్ర కుక్కను కలుస్తుంది.డాన్స్ కి ఉన్న అపార శక్తిని జోడించి దానితో స్నేహం చేయాలనుకుంటుంది.

కుక్క వేషధారణలో ఉన్న స్పార్కల్స్ ను చూడండి.కేవలం స్పాట్ కోసం ముస్తాబైన కస్టం మేడ్ కాస్ట్యూమ్ డాగ్ ఇది' అంటూ కంపెనీ వీడియో కింద ఓ సరదాగా క్యాప్షన్ ను జత చేసింది.

"""/" / ఈ వీడియోలో ముందుగా రెండు రోబోలు ఒకరికొకరి తెలియకుండా ఉన్నట్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి.

ఆ తర్వాత ఒకటికి ఒకటి స్నేహ హస్తం అందిస్తున్నట్లుగా జరుగుతుంది.ఆ తర్వాత రెండు కలిసి గంతేసిన క్షణాలు ఈ వీడియోలో గమనించవచ్చు.

మొత్తానికి ఈ వీడియో ఇంటర్నేషనల్ డాన్స్ డే( International Dance Day ) సందర్భంగా కంపెనీ విడుదల చేసింది.

వీడియో చివర్లో అలసిపోయినట్లుగా రెండు రోబోలు కింద కూర్చొని పోతాయి.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటీజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

ఇందులో కొందరు వీడియో క్రియేటివ్ గా ఉందని కామెంట్ చేస్తుండగా మరికొందరైతే కుక్కలు రాత్రులు కలలోకి వస్తాయేమో భయంకరంగా ఉన్నాయంటూ కామెంట్ చేస్తున్నారు.

ఐపీఎల్ ఫైనల్ లో షారుక్ ధరించిన ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?