రైలు పట్టాలకు రాళ్లు కట్టిన మైనర్ బాలుడు.. వైరల్ గా మారిన వీడియో..

ఒక్కొక్కసారి చిన్నపిల్లలు చేసే చిలిపి పనులు, సరదాగా చేసే పనులు ప్రమాదానికి కారణమవుతాయి.

పిల్లలు సరాదాగా ఆడుకునేందుకు తెలియకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటారు.ఈ పనుల వల్ల ఒక్కొక్కసారి పెద్ద ప్రమాదాలు చోటుచేసుకోవచ్చు.

తాజాగా ఒక బాలుడి తెలియక చేసిన ఒక పని ప్రమాదానికి దారి తీసేంత పని చేసింది.

చివరికి బాలుడు చేసిన పని చూసి అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.

అసలు వివరాల్లోకి వెళితే. """/" / కర్ణాటకలో( Karnataka ) 12 ఏళ్ల బాలుడు రైల్వే పట్టాలకు( Railway Track ) రాళ్లు కట్టాడు.

రైలు ట్రాక్‌లకు ఇరువైపులా పెద్ద పెద్ద రాళ్లు ( Stones ) పెట్టాడు.

పట్టాలపై రాళ్లు పెడితే ప్రమాదం జరుగుతుందని మైనర్ బాలుడికి తెలియక సరదాగా ఆడుకుంటూ ఇలా రాళ్లు కిలోమీటర్ వరకు పేల్చాడు.

చివరికి ఒక వ్యక్తి మైనర్ బాలుడు పెట్టిన రాళ్లను చూశాడు.ఇలా రాళ్లు ఎందుకు పెడుతున్నావని బాలుడిని ప్రశ్నించగా.

తాను సరదాగా పెడుతున్నానని, తనకు పెట్టమని ఎవరూ చెప్పలేదని అన్నాడు.ఇలా పెట్టడం వల్ల ప్రమాదం జరుగుతుందని చెప్పడంలో బాలుడు అర్థం చేసుకున్నాడు.

ఇంకోసారి ఈ పనిచేయనంటూ చెప్పాడు.చివరికి బాలుడి పెట్టిన రాళ్లను వెంటనే తొలగించడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.

"""/" / అరుణ్ పుదూర్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో రైలు పట్టాలపై రాళ్లు పెట్టిన ఒక బాలుడిని వ్యక్తి పట్టుకుని పోలీసులకు అప్పగించాలని అనుకున్నాడు.

దీంతో తాను తెలియక చేశానని బాలుడి ప్రాధేయపడుతున్నట్లు వీడియోలో కనిపించింది.తనను పోలీసులకు అప్పగించవద్దని బాలుడు కాళ్లు, చేతులు పట్టుకుని బ్రతిమిలాడుతున్నట్లు వీడియోలో ఉంది.

ఇంకోసారి ఇలాంటి పనులు చేయవద్దని బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

మిస్ ఇండియా యూఎస్ఏగా చెన్నై భామ.. ఎవరీ కైట్లిన్ సాండ్రా?