US Airport : యూఎస్ ఎయిర్‌పోర్ట్‌లోని ఈ బ్యాగేజీల గజిబిజి చూశారా.. వీడియో వైరల్..

విమానాశ్రయాలలోని ఉద్యోగులు ప్రయాణికుల లగేజీ, బ్యాగేజీల( Luggage Bags ) విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

వీరు ఎలా పడితే అలా విసిరేయడం, సూట్ కేసులను విరగొట్టడం వంటి సంఘటనలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయి షాక్ ఇచ్చాయి.

ఇప్పుడు ఆ కోవకు చెందిన మరొక వీడియో వైరల్ అవుతుంది.ఆ వీడియోలో ఒక ట్రావెల్ బ్లాగర్ యూఎస్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న లగేజీల విషయాలను చూపించాడు.

వీడియోలో, కన్వేయర్ బెల్ట్‌( Conveyor Belt )పై పెద్ద సంఖ్యలో బ్యాగులు గుట్టలుగా పోగుపడి, గందరగోళంగా ఉన్నాయి.

ఒక బ్యాగ్ మెషీన్‌లో చిక్కుకుని చిరిగిపోయింది.బ్లాగర్ ఈ దృశ్యాన్ని చూసి ఆందోళన చెందారు.

లగేజీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు.ప్రయాణికుల సామానుకు భద్రత లేదని, వాటిని జాగ్రత్తగా నిర్వహించడం లేదని వాపోయారు.

"""/"/ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.చాలా మంది ప్రయాణికులు తమ సొంత అనుభవాలను పంచుకుంటూ, లగేజీ నిర్వహణలో లోపాలను విమర్శించారు.

ఎయిర్‌లైన్ సంస్థ ఈ ఘటనపై స్పందించాలని, ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలని డిమాండ్ చేశారు.

బ్యాగు చిరిగిపోతున్నా సిబ్బంది పట్టించుకోలేదని, సహాయం చేయడానికి ముందుకు రాలేదని బ్లాగర్( Blogger ) విమర్శించారు.

కొంతమంది వ్యూయర్స్‌ బ్లాగర్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.సహాయం చేయడానికి బదులుగా వీడియో తీయడంపై మండిపడ్డారు.

ఇంటర్నెట్‌లో లైక్‌లు కోసం ప్రజలు ఇతరుల కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. """/"/ కన్వేయర్ బెల్ట్ పై బ్యాగులు పోగుపడకుండా చూసుకోవడానికి ఎయిర్‌పోర్ట్ సిబ్బంది( Airport Staff )ని నియమించాలని కొందరు సూచించారు.

బెల్ట్ నిండిపోయినప్పుడు దాన్ని ఆపడానికి ఒక బటన్ లేదా సెన్సార్ ఉండాలని కోరారు.

జపాన్( Japan ) వంటి దేశాలలో ఇలాంటి సమస్యలు ఎక్కడా కూడా కనిపించవని కొందరు వ్యాఖ్యానించారు.

ఎందుకంటే అక్కడ సామాను బెల్ట్ పై బ్యాగులు కుప్పలు తిప్పలుగా పేరుకు పోకుండా చూసుకోవడానికి ఎల్లప్పుడూ సిబ్బంది ఉంటారని తెలిపారు.

ఆస్ట్రేలియాలోని భారత కాన్సులేట్ కార్యాలయంపై విద్వేష దాడి