వీడియో: దిల్బర్‌ పాటకు ఈ బుడతడు చేసిన డ్యాన్స్ చూసి ఐపీఎస్ అధికారిణి ఫిదా..!

సత్యమేవ జయతే సినిమాలో నేపథ్య గాయని నేహా కక్కర్ పాడిన దిల్బర్‌ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఇప్పటికే ఈ వీడియోకి యూట్యూబ్ లో 25 కోట్ల వ్యూస్ వచ్చాయి.అయితే తాజాగా ఈ పాటకు ఒక బుడతడు అద్భుతంగా డాన్స్ చేశాడు.

హీరోయిన్ నోరా ఫతేహికి ఏ మాత్రం తీసిపోకుండా అతడు డ్యాన్స్ చించేశాడు.దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఈ నేపథ్యంలో డా.నవజ్యోత్ సిమి అనే ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఫిదా అయిపోయారు.

"ఆహా ఏమి ఆ డ్యాన్స్? సూపర్.ఛత్తీస్‌గఢ్ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి అద్భుతమైన టాలెంట్ చూడండి" అంటూ ఐపీఎస్ అధికారిణి నెట్టింట ఒక వీడియో షేర్ చేశారు.

ఇప్పుడా వీడియో అందర్నీ ఫిదా చేస్తోంది.వైరల్ వీడియోలో 7వ తరగతి విద్యార్థి పాపులర్ సాంగ్ దిల్బర్‌కు బెల్లీ డ్యాన్స్ చేస్తున్నాడు.

ఈ వీడియో ఛత్తీస్‌గఢ్‌ లోని గౌరెలా-పెండ్రా-మార్వాహి జిల్లాలోని సర్ఖోర్ పెండ్రా అనే ప్రభుత్వ పాఠశాలలో చిత్రీకరించారు.

ఒరిజినల్ పాటలో నోరా ఫతేహి ఎలా చేసిందో అదే విధంగా తన శరీరాన్ని తిప్పితూ ఈ కుర్రాడు కేక పుట్టించాడు.

7వ తరగతి చదువుతున్న ఈ డ్యాన్సర్ పేరు వివేక్.అతని బెల్లీ డ్యాన్సింగ్ చూసి అతని చుట్టూ నిలబడి ఉన్న వ్యక్తులు ఆశ్చర్యచకితులయ్యారు.

ఇది అతనిలో ఉత్సాహాన్ని మరింత పెంచింది.దీంతో అతడు మరింత గొప్పగా డ్యాన్స్ చేస్తూ అందరి మనసులను దోచేశాడు.

"""/" / డ్యాన్స్ లో వివేక్ నైపుణ్యం చూస్తే శిక్షణ పొందిన డ్యాన్సర్‌ని తలపించేలా ఉంది.

అయితే, వాస్తవానికి అతను కేవలం 7వ తరగతి విద్యార్థి.అయినప్పటికీ పుట్టుకతోనే డాన్స్ చేయడం వచ్చినట్లు అద్భుతంగా స్టెప్పులు వేస్తూ ఆశ్చర్యపరిచాడు.

ఈ వీడియోని మొదట ఒక జర్నలిస్టు షేర్ చేశాడు.అదే వీడియో ని తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

దీంతో ఈ వీడియోని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.భారతదేశంలో అసలైన టాలెంట్ అంటే ఇదే అని, చాలా గ్రేట్ టాలెంట్ అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

వచ్చే నెలలో అమెరికాకు నరేంద్రమోడీ.. అధ్యక్ష ఎన్నికల వేళ ప్రాధాన్యత