వీడియో: యూకే మహిళను తన ఫ్లాట్‌కి ఎత్తుకెళ్లిన ఇండియన్ స్టూడెంట్.. ఆపై అత్యాచారం..

విదేశాల్లో ఎన్నారైల నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.తాజాగా భారత్‌కు( India ) చెందిన మరో యువకుడు ఒక దారుణానికి ఒడి గట్టాడు.

ప్రీత్ వికల్ ( Preet Vical )అనే ఈ యువకుడు యునైటెడ్ కింగ్‌డమ్‌లో చదువుతున్నాడు.

ఆ చదువుపై పెద్దగా శ్రద్ధ లేని ఈ ఎన్నారై స్టూడెంట్ ఏ మాత్రం భయం లేకుండా ఒక అత్యాచార నేరం చేశాడు.

ఇప్పుడు అతడికి జైలు శిక్ష పడింది.ఈ ఘటన వేల్స్‌లోని కార్డిఫ్‌లో చోటుచేసుకుంది.

సీసీటీవీ ఫుటేజీ, సెక్యూరిటీ కెమెరాల ద్వారా రికార్డ్ అయిన వీడియో ఫుటేజీ ప్రకారం, ప్రీత్ వికల్ మద్యం మత్తులో ఉన్న యూకే మహిళను సిటీ సెంటర్ గుండా తీసుకువెళుతున్నట్లు కనిపించింది.

"""/" / అతను ఆమెను తన భుజాలపై, తన చేతుల్లో మోస్తున్నట్లు కనిపించాడు.

అనంతరం ఆమెను ఓ ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని తేలింది.20 ఏళ్ల ప్రీత్ వికల్ అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించాడు.

ఫలితంగా, అతను యువ నేరస్థుల కోసం నిర్మించిన ఒక ప్రత్యేక రకం జైలులో ఆరు సంవత్సరాల తొమ్మిది నెలలు గడపవలసి వచ్చింది.

ఈ ఘటన తర్వాత నిద్రకు ఇబ్బందిగా ఉందని దాడికి గురైన మహిళ తెలిపింది.

ప్రీత్ వికల్ తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లినప్పుడు ఆ మహిళను కలిశాడు, కానీ ఆమె వారి నుంచి విడిపోయింది.

ఆమె బలహీన స్థితిని సద్వినియోగం చేసుకోవాలని ప్రీత్ అనుకున్నాడు.ఆపై స్కెచ్ వేసి ఆమెను పట్టుకుని ఎత్తుకుని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

"""/" / ఈ ఘటనపై కార్డిఫ్‌లోని సౌత్ వేల్స్‌లోని( Cardiff, South Wales ) పోలీసులు మాట్లాడుతూ, నగరంలో ఇలాంటి అపరిచితుల దాడులు చాలా అరుదు అని అన్నారు.

ప్రీత్ వికల్‌ ఒక ప్రమాదకరమైన వ్యక్తి అని అభివర్ణించారు.ఆ ప్రాంతంలోని వివిధ కెమెరాల్లోని సీసీటీవీ ఫుటేజీని జాగ్రత్తగా పరిశీలించిన అతడిని గుర్తించి అరెస్ట్ చేయగలిగామని పోలీసులు పేర్కొన్నారు.

ప్రీత్ వికల్ తన జైలు శిక్షలో మూడింట రెండు వంతులు కస్టడీలో శిక్షను అనుభవిస్తాడు.

మిగిలిన శిక్షా భాగం కొన్ని షరతులలో పర్యవేక్షించడం జరుగుతుంది.