వీడియో: థాయ్‌లాండ్ వరదల్లో కొట్టుకొచ్చిన భారీ కొండచిలువ.. దాని కడుపులో ఏముందో తెలిస్తే..
TeluguStop.com
మలేషియా, దక్షిణ థాయ్‌లాండ్‌లలో( Malaysia, In Southern Thailand ) ఇటీవల కురిసిన భారీ అకాల వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి.
వీటి వల్ల వేలాది మంది తమ ఇళ్లు వదిలి వెళ్లవలసి వచ్చింది.వరదల వల్ల ఇప్పటి వరకు 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
థాయ్‌లాండ్‌లోని విపత్తు నివారణ శాఖ( Disaster Prevention Department ) ఈ విషయాన్ని ధృవీకరించింది.
3 లక్షలకు పైగా కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.రక్షణ, తరలింపు కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ, పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.
ఇలాంటి సమయంలో థాయ్‌లాండ్ వరదల్లో ఒక షాకింగ్ దృశ్యం కనిపించింది.పట్టాని ప్రావిన్స్‌లోని వరద నీటిలో ఒక పెద్ద పైథాన్ పాము దర్శనం ఇచ్చింది.
అంతే కాదు దాని పొట్ట బాగా ఉబ్బి ఉంది.అది ఏ మనిషినైనా మింగేసిందా? అని కొందరు ప్రశ్నలు వేస్తున్నారు.
కొందరు మాత్రం ఈ కొండచిలువ ఒక కుక్కను తిన్నదేమో అందుకే దానికి కడుపు ఉబ్బింది అని అంటున్నారు.
డిసెంబర్ 1న చిత్రీకరించిన ఈ వీడియోను తాజాగా @AMAZINGNATURE అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు.
"ఈ భారీ పాము, బహుశా రెటిక్యులేటెడ్ పైథాన్ కావొచ్చు, దక్షిణ థాయ్‌లాండ్‌లోని వరద నీటిలో తేలుతూ కనిపించింది" అని క్యాప్షన్‌లో రాశారు.
"""/" /
ఈ క్లిప్‌ను దాదాపు 20 లక్షలమంది చూశారు.ఒక యూజర్ "నేను థాయ్‌లాండ్‌ను నా బకెట్ లిస్ట్ నుంచి తొలగించేశాను" అని రాశారు.
మరొకరు "అది రెటిక్యులేటెడ్ పైథాన్, అది చనిపోయి ఉంటుంది లేదా చాలా ఇబ్బంది పడుతుంది.
పాపం" అని కామెంట్ చేశారు.మరొకరు "పాము పొట్ట ఉబ్బరం చాలా భయంకరంగా మానవుని ఆకారంలో ఉంది!" అని అన్నారు.
"""/" /
దక్షిణ థాయ్‌లాండ్‌లోని పట్టాని, నరాతివాత్, సాంగ్ఖ్లా, నఖోన్ సి తమ్మరత్, ఫట్థాలుంగ్ అనే ఐదు జిల్లాలు వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
33,000 మందికి పైగా తమ ఇళ్లు వదిలి వెళ్లవలసి వచ్చింది.డిసెంబర్ 5వ తేదీ వరకు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని, వరదలు వచ్చే అవకాశం ఉందని ఖనిజ వనరుల శాఖ హెచ్చరించింది.
ప్రభావిత ప్రాంతాలకు సహాయక చర్యలు చేపట్టాలని రెస్క్యూ బృందాలను ఆదేశించారు.
ఆ పాటకు సాయి పల్లవి కొరియోగ్రఫీ చేసిందా…. ఈమెలో ఈ టాలెంట్ కూడా ఉందా?