వీడియో: స్నాక్ ప్యాకెట్‌ను మట్టిలో రుద్ది ఇచ్చాడు.. ఈ కోతి ఏం చేసిందంటే…
TeluguStop.com
మనుషుల తర్వాత తెలివైన జీవులుగా కోతులు పేరు తెచ్చుకున్నాయి.వీటిలో అబ్సర్వేషన్ స్కిల్స్( Observation Skills ) చాలా ఎక్కువగా ఉంటాయి.
మానవులు చేసే పనులను చూసి అవి చాలానే విషయాలను నేర్చుకోగలవు.ఇవి టూల్స్ మనుషుల్లాగే ఉపయోగించగలవు.
ఫుడ్ ఉన్న సీసాల మూతలు తీయడం, ప్యాకెట్ చించేసి చిప్స్ తినడం వంటి స్మార్ట్ పనులెన్నో చేయగలవు.
కోతులు( Monkeys ) మనుషుల్లాగే శుభ్రంగా ఉండటానికి కూడా ఇష్టపడతాయి.వాటిలో పరిశుభ్రత పట్ల మక్కువ కాస్త ఎక్కువే.
ఆ విషయం తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో ద్వారా మరోసారి రుజువు అయింది.
"""/" /
ఈ వీడియోలో ఒక యువకుడు ఒక స్నాక్ ప్యాకెట్( Snack Packet ) తన ముందు ఉన్న కోతికి చూపించాడు.
తర్వాత ఆ ప్యాకెట్ ను మట్టిలో రుద్ది అది బాగా మురికి అయ్యేలా చేశాడు.
అనంతరం కోతికి దాన్ని అందించాడు.స్నాక్ ప్యాకెట్ తీసుకునే ముందు వానరం కన్నెర్ర చేసింది.
నీట్ గా ఉన్న ప్యాకెట్ ను మురికి చేస్తావా అన్నట్లు ఒక యాంగ్రీ లుక్ కూడా ఇచ్చింది.
ఆపై ప్యాకెట్ కి అంటుకున్న మట్టిని తన చేతులతో దులిపింది.దాన్ని క్లీన్ చేశాక నోటితో ప్యాకెట్‌ను చించింది.
ఆపై అందులోని స్నాక్ ని తీసి, దానికి కూడా మట్టి అంటుకుందేమో అని చేతులతో దులిపింది.
కానీ దానికి ఏమీ అంటలేదని వెంటనే గ్రహించింది.అనంతరం స్నాక్ ను నోట్లో వేసుకుని తినేసింది.
ఈ వీడియోను @animalsinplanet ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.దీనికి 30 లక్షల వరకు లైక్‌లు వచ్చాయి.
కొందరు ఈ కోతి పరిశుభ్రతను చూసి ఫిదా అవ్వగా, మరికొందరు కోతులకు ప్యాక్‌డ్, ప్రాసెస్డ్ ఫుడ్ హెల్తీ కాదని వాటికి అవి ఇవ్వొద్దని అంటున్నారు.
విమానంలాంటి అద్భుతమైన కారును కొనుగోలు చేసిన విజయ్.. ఈ కారు ప్రత్యేకతలివే!