వీడియో: వేగంగా వెళ్తూ బైక్ పైనుంచి కింద పడ్డ అమ్మాయి.. గాయాలు చూస్తే!!
TeluguStop.com
ఇండియా చాలా అందమైన దేశం.ట్రావెల్ చేయాలనుకునే వారికి మంచి అనుభూతిని అందిస్తుంది.
ముఖ్యంగా కొండలు, ఘాటు రోడ్ల మార్గాల్లో బైక్ (Bike)ప్రయాణం చేస్తే వచ్చే అనుబూతే వేరు.
అడ్వెంచర్ ప్రియులు (Adventure Lovers)ఈ అందమైన ప్రకృతి దృశ్యాలు ఆస్వాదించడానికి చాలా రిస్క్ చేస్తుంటారు.
కానీ ఆ మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే రైడర్లు అప్రమత్తంగా ఉండాలి.
అలాగే చాలా అనుభవం వస్తేనే ఆ రోడ్లలో ప్రయాణించాలి.లేదంటే ఏమవుతుందో చెప్పకనే చెప్పే ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో, ఓ యువతి కొండపై వేసిన రహదారి(hill Road) మార్గంలో షార్ప్ టర్న్ తీసుకునేటప్పుడు తన వేగాన్ని అంచనా వేయలేక పోయి బైక్‌పై నుంచి కింద పడిపోయింది.
వెనుక వస్తున్న మరో రైడర్ తన హెల్మెట్‌కు అతికించిన గోప్రో కెమెరాతో ఈ దృశ్యాన్ని రికార్డ్ చేశారు.
"ఘర్ కే కలేష్" (Ghar Ke Kalesh)అనే ఎక్స్ అకౌంట్ ఈ వీడియోను షేర్ చేసింది.
వీడియోలో కొండ ప్రాంతంలో నిర్మించిన రోడ్డుపై కొంతమంది బైక్ రైడర్లు గుంపుగా వెళ్లడం చూడవచ్చు.
వీడియో ప్రారంభంలో, అందరూ కలిసి సరదాగా వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. """/" /
కొంతదూరం వెళ్ళాక, గ్రూప్‌లోని ఒక యువకుడు తన వెనుక వస్తున్న యువతిని చూపిస్తూ, "ఇది మా గ్రూప్‌లోని అమ్మాయి, బైక్ చాలా బాగా నడుపుతుంది" అని చెప్పాడు.
అతను ఈ మాటలు చెప్పగానే, ఆ యువతి షార్ప్ రైట్ టర్న్ తీసుకోబోయింది.
కానీ, వేగాన్ని తగ్గించలేదు.షార్ప్ టర్మ్స్ వచ్చినప్పుడు వేగాన్ని చాలా తగ్గించాలి.
లేకపోతే బైక్ కంట్రోల్ అవ్వదు.ఈ విషయం ఈ యువతకి తెలియనట్టుంది.
ఈ ప్రమాదంలో ఆమె జీన్స్ చిరిగిపోయి, మోకాలు బాగా గాయపడింది.ఆమె మోకాలి వద్ద అర అంగుళం మందం చర్మం లేచిపోయినట్టుగా కనిపించింది.
పైనుంచి కింద పడటం వల్ల చేతులకు ఇంకా శరీరానికి కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది.
అందుకే ఆమె వెంటనే లేవలేకపోయింది.ఇతర రైడర్లు ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించారు.
"""/" /
ఈ వీడియో చూసిన చాలామంది "అలా పొగిడాడో లేదో వెంటనే కింద పడిపోయిందిగా, డ్రైవింగ్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ దీనిని ఫన్‌గా ఎవరూ చూడకూడదు" అని వ్యాఖ్యానించారు.
"ఇలాంటి మలుపులు చాలా ప్రమాదకరమైనవి.కింద పడినప్పుడు ఏదైనా బలమైన వస్తువు తలకి తగిలితే ప్రాణాలు పోవడమే జరుగుతుంది" అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
యోగి ఆదిత్యనాథ్‌ను ఆకట్టుకున్న ఇటాలియన్ మహిళలు.. ఏం చేశారో చూడండి!