Wife : వీడియో: పొట్ట వల్ల పట్టని చొక్కా బటన్స్.. భార్య ఫన్నీ సొల్యూషన్..!
TeluguStop.com
భర్తలకు వచ్చే సమస్యలకు భార్యల వద్ద ఉత్తమమైన పరిష్కారాలు ఉంటాయి.అయితే వారు చూపించే సొల్యూషన్స్ కొన్ని బెస్ట్ గా అనిపిస్తే, మరికొన్ని చెత్తగా అనిపిస్తాయి.
ఆ తరహా భార్యకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"""/" /
వైరల్ క్లిప్ ఓపెన్ చేస్తే మనకు ఒక టేబుల్ మీద చేతులు పెట్టి సెల్ ఫోన్ వాడుతున్న మహిళ కనిపిస్తుంది.
కొద్దిసేపటికి ఆమె భర్త టేబుల్ వద్దకు వస్తాడు.తన పొట్ట కారణంగా చొక్కా బటన్లు పెట్టుకోవడం కష్టంగా ఉందని భార్యకు చెబుతాడు.
అయితే ఆమె తన దగ్గర ఒక ఐడియా ఉందని చెబుతూ పక్కనే ఉన్న కత్తెర తీసుకుంటుంది.
భర్తను( Husband ) వెనక్కి తిరగమని సైగ చేస్తుంది.భర్త అలానే చేస్తాడు.
ఆమె చొక్కా వెనక వైపు దాదాపు 15 అంగుళాల మేర మధ్యగా కట్ చేస్తుంది.
తర్వాత ముందుకు తిరగమని చెబుతుంది.భర్త అలాగే చేయగా ఆమె బటన్లను ఈజీగా పెడుతుంది.
వెనకవైపు చొక్కా చిరగడం( Shirt Tearing ) వల్ల ఈ బటన్లు త్వరగా పెట్టడం సాధ్యమైంది.
అయితే చిరిగిన చొక్కాను కవర్ చేయడానికి ఆమె ఒక కోటు కూడా ఇచ్చింది.
దాన్ని వేసుకున్నాక చిరిగిన భాగం కనిపించలేదు. """/" /
@TheBestFigen ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.
షేర్ చేసిన సమయం నుంచి దీనికి ఇప్పటికే 53 లక్షల వ్యూస్ వచ్చాయి.
18 సెకన్ల నిడివి ఉన్న ఈ చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు.ఆ షర్ట్‌ను పట్టేలా చేయడానికి ఈమె ఎంత ఛార్జ్ చేసింది? అని ఒకరు ప్రశ్న వేశారు.
ఇది ఒక ప్రాక్టికల్ సొల్యూషనే కావచ్చు కానీ నైతికంగా ఇది తప్పు అని మరొక యూజర్ కామెంట్ చేశాడు.
చాలా మంచి షర్టును కత్తిరించి పాడు చేశారని ఇంకొక వ్యక్తి అసహనం వ్యక్తం చేశాడు.
ఆ షర్టు కత్తిరించే బదులు పొట్ట తగ్గించుకోవచ్చు కదా అని మరికొందరు సరదాగా వ్యాఖ్యానించారు.
ఆ చొక్కాను అలా కట్ చేయడం వల్ల చివరికి అది పూర్తిగా చిరిగిపోయి, వినియోగించడానికి పనికిరాకుండా పోతుందని మరికొందరు పేర్కొన్నారు.
ఇది బెస్ట్ సొల్యూషన్ కాకపోవచ్చు కానీ క్విక్ సొల్యూషన్ అని ఇంకొందరు జోకులు పేల్చారు.
అతడి భార్య చాలా జీనియస్ అని, అందుకే మంచి సొల్యూషన్ కనిపెట్టిందని ఇంకొందరు సెటైర్లు వేశారు.
దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.
ఓజీ సినిమాతో అకీరా నందన్ ఎంట్రీ ఇస్తున్నారా.. రామ్ చరణ్ జవాబు ఇదే!