అక్షర చిట్ ఫండ్స్ ఆఫీసుకు తాళం వేసిన బాధితులు
TeluguStop.com
నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని అక్షర చిట్ ఫండ్స్ బ్రాంచి ముందు బాధితులు ఆందోళన చేపట్టారు.
చిట్టీ ఎత్తి 10 నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకుండా ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ తమను మోసం చేశారని,చిట్ ఫండ్ కార్యాలయానికి బాధితులు తాళం వేశారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ నల్లగొండ శివాజీనగర్ బ్రాంచిలో ఐదు నెలలుగా ఎత్తిన చిట్టి డబ్బులు ఇవ్వకుండా
ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బ్రాంచి మేనేజర్ బెదిరిస్తున్నారని వాపోయారు.
పుష్ప 2 మీద ఈ రేంజ్ లో హైప్ ఎందుకు పెంచుతున్నారు…