విశాఖలో ఉపరాష్ట్రపతి.. ఎందుకోసం అంటే.. ?

భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విశాఖపట్నంలో నాలుగు రోజులు పర్యటించనున్న విషయం తెలిసిందే.

కాగా ఉపరాష్ట్రపతి విశాఖను పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారైన వెంటనే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ క్రమంలో నేడు విశాఖపట్నం చేరుకున్న వెంకయ్యనాయుడికి ఏపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పాటుగా జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీస్ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా, నగర మేయర్ హరికుమారి, తూర్పు నౌకాదళం అధిపతి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్, విశాఖ పోర్టు చైర్మన్ రామ్మోహనరావు తదితరులు ఘన స్వాగతం పలికారు.

"""/"/ ఇకపోతే విశాఖలో ఈ నెల 29 వరకు జరిగే అనేక కార్యక్రమాల్లో వెంకయ్యనాయుడు పాల్గొననున్నారని సమాచారం.

ఇదిలా ఉండగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు పోర్టు ట్రస్టు ఛైర్మన్, అధికారులతో ఉపరాష్ట్రపతి సమావేశం నిర్వహిస్తారని, ఇక రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వర్చువల్ మీటింగ్​లో ముఖ్య అతిథిగా 27వ తేదీన ఉదయం 10 గంటల నుంచి పదిన్నర గంటల వరకు పాల్గొని మిగతా కార్యక్రమాలు ముగించుకుని, 29న ఉదయం 11 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారని సమాచారం.

ఏడు సినిమాలు ఫ్లాప్..లక్ష్మి నరసింహ నుంచి సింహ వరకు ఏం జరిగింది ?