దీనస్థితిలో మరో సీనియర్ నటి.. కుటుంబ సభ్యులే అలా ప్రవర్తిస్తున్నారంటూ?

ఈ మధ్య కాలంలో పలువురు సినిమా, సీరియల్ నటీమణులు తమ ఆర్థిక కష్టాలను చెప్పుకుంటూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

కొన్నిరోజుల క్రితం బుల్లితెర నటి షగుప్త అలీ వైద్య చికిత్స కొరకు కారుతో పాటు బంగారు నగలను అమ్మేశానని చెప్పారు.

ప్రముఖ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఆమెకు ఆర్థిక సహాయం అందజేసిన సంగతి విదితమే.

ఏకంగా 5 లక్షల రూపాయలు డ్యాన్స్ దీవానీ బృందం తరపున ఆమె ఇచ్చారు.

అయితే మరో నటి సవితా బజాజ్ కూడా ఆర్థిక కష్టాలను అనుభవిస్తున్నారు.గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న సవితా బజాజ్ అయిన వాళ్లు కూడా ఆదరించకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.

తాను సంపాదించిన డబ్బులన్నీ ఖర్చైపోయాయని వైద్యం కొరకే ఆ మొత్తాన్ని ఖర్చు చేశానని ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలకు కొత్తగా శ్వాస సంబంధిత సమస్యలు కూడా యాడ్ అయ్యాయని చెప్పుకొచ్చారు.

"""/"/ తనకు సొంత ఇల్లు కూడా లేదని నెలకు 7,000 రూపాయల అద్దె చెల్లిస్తూ చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

గతంలో తనకు సినిమా మరియు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, రైటర్స్ అసోసియేషన్ నుంచి నుంచి లక్షన్నర రూపాయలు వచ్చాయని ఎవరైనా తనకు డబ్బులు ఇస్తే వాటిని తిరిగి ఇచ్చేయాలని అనుకునేదానినని ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదని నటి చెప్పుకొచ్చారు.

సినిమాల్లో తిరిగి నటిస్తాననే నమ్మకం కూడా తనకు లేదని ఆమె అన్నారు.తన బ్యాడ్ లక్ వల్ల తనను చూసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదని నటి చెప్పుకొచ్చారు.

ఫ్యామిలీ మెంబర్స్ కొరకు తాను ఎంతో ఖర్చు చేశానని ప్రస్తుతం తాను ఆర్థిక సాయం కోరే పరిస్థితి ఏర్పడిందని సవితా బజాజ్ చెప్పుకొచ్చారు.

ఈ నటికి ఎవరైనా సాయం చేస్తారేమో చూడాల్సి ఉంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం