ఈ వెర్సటైల్ డైరెక్టర్ కు ఈసారి అయినా హిట్ దక్కుతుందా?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఈయన ఒకరు.ఈయన కెరీర్ స్టార్టింగ్ నుండి తనదైన శైలిలో సమాజానికి ఏదొక మెసేజ్ ఇస్తూ సినిమాలను చేస్తున్నాడు.

ప్రత్యేకమైన విభిన్నమైన సినిమాలతో తనకంటూ టాలీవుడ్ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈయన సూపర్ హిట్ మాత్రం అందుకోలేక పోయాడు.

తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దం అవుతున్న ఇప్పటికి ఒక్క చెప్పుకోదగ్గ హిట్ కూడా అందుకోలేక పోయాడు ఈ డైరెక్టర్.

దీంతో ఈ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ల లిష్టులో చేరలేక పోయాడు ఈ డైరెక్టర్ తెలుగు మాత్రమే కాదు హిందీలో, తమిళ్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించు కున్నాడు.

అయినా కొంత కాలంగా ప్లాపులు మాత్రమే పలకరించడంతో ఈయన గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుంది.

వరుస ప్లాప్స్ రావడంతో ఇప్పుడు తప్పకుండ హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో ఈ డైరెక్టర్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు సన్నిహితుల నుండి సమాచారం అందుతుంది.

ఇన్ని ప్లాప్స్ వచ్చిన కూడా ఈయన బిగ్ హీరోతో సినిమా అవకాశాన్ని అందుకుని అందరిని సర్ప్రైజ్ చేసాడు.

ఈ సినిమా ఇప్పటికే సెట్స్ మీదకు కూడా వెళ్ళింది. """/" / అయితే అనేక కారణాలతో ఈ స్టార్ హీరోతో చేస్తున్న సినిమా షూటింగ్ ఆగిపోతూ వస్తుంది.

దీంతో వీలైనంత తక్కువ రోజుల్లో ఈ సినిమా పూర్తి చేయాలని ట్రై చేస్తున్న హీరో ఈయనకు పెద్ద అడ్డంకిగా మారాడు.

ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన అవుట్ ఫుట్ పై పెదవి విరుస్తున్నట్టు టాక్.

అంతేకాదు కథలో మార్పులు కూడా చేయమని ఈ డైరెక్టర్ ను కోరడంతో ఇప్పుడు మరింత ప్రెజర్ పడింది.

తాజాగా ఈ సినిమా వచ్చే నెలలో తన పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని హీరో ఆర్డర్ వేసారట.

మరి ఈ డైరెక్టర్ ఈ హీరోను ఎలా డీల్ చేస్తాడో చూడాలి.ఈ సినిమాపై ఈయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

మరి హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

ఫేక్ రికార్డ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ.. అసలేం జరిగిందంటే?