వైరల్: ఆ మహిళా కోసం కారును ఎత్తిపడేశారు!
TeluguStop.com
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఘటనలు పెరిగిపోతున్నాయి.సాధారణంగా ఎవరైనా రోడ్డ్దు ప్రమాదాలలో గాయపడితే వెంటనే వారిని రక్షించడానికి ఆంబులెన్స్ కు ఫోన్ చేయడం, పోలీసులకు సమాచారం అందించడం చేస్తాం.
ప్రమాదాన్ని బట్టి ఆ ప్రమాదానికి ఏ విధంగా స్పందించాలో నిర్ణయం తీసుకొని అదే విధంగా స్పందిస్తాం.
కానీ అమెరికాలో ఒక యువతిని రక్షించటం కోసం కొందరు ఏకంగా ఒక కారునే ఎత్తిపడేశారు.
సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.పూర్తి వివరాలలోకి వెళితే వెరోనికా అనే 24 సంవత్సరాల వయస్సు గల యువతి న్యూయార్క్ నగరంలో పుట్ పాత్ పై నిలబడి ఉంది.
అదే సమయంలో అటుగా ప్రయాణిస్తున్న ఒక కారు అదుపుతప్పి యువతిపైకి దూసుకొచ్చింది.ఈ ప్రమాదంలో యువతి కారు కింద పడింది.
వెరోనికా రెండు కాళ్లు కారు వెనుక చక్రాల కింద ఇరుక్కున్నాయి.కారు బరువు అంతా వెరోనికాపై పడటం, కాళ్లు చక్రాల మధ్య ఇరుక్కుపోవడంతో వెరోనికా గట్టిగా కేకలు పెట్టింది.
స్థానికులు కారు కింద యువతి పడిందని గమనించి వెంటనే ఆమెను రక్షించటానికి ప్రయత్నం చేశారు.
యువతిని కాపాడటం కొరకు అక్కడ ఉన్నవారంతా ఒక గుంపుగా ఏర్పడి కారును పైకి ఎత్తి పక్కకు పడేసి యువతిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చేరిన వెరోనికా చికిత్స తరువాత కోలుకుంది.తనను ప్రమాదం నుండి రక్షించిన వారికి వెరోనికా కృతజ్ఞతలు చెప్పింది.
ఒక కారును గుంపుగా ఏర్పడి పైకి ఎత్తిపడేసి ఒక యువతిని కాపాడటంతో ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
అంతరిక్షంలో చెమట, మూత్రాన్ని రీసైకిల్ చేసి వాడుకుంటున్న సునీతా విలియమ్స్..?