నాగచైతన్య శోభిత నిశ్చితార్థం… సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి?
TeluguStop.com
ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు స్వామి( Venu Swamy ) పెద్ద ఎత్తున పాపులర్ అయిన సంగతి మనకు తెలిసిందే.
ఈయన ఎప్పుడైతే సమంత( Samantha ) నాగచైతన్య ( Naga Chaitanya ) వివాహం చేసుకుంటున్నారని తెలియగానే వారు మూడు సంవత్సరాలకు విడిపోతారని తెలియజేశారు.
అప్పట్లో సమంత నాగచైతన్య అభిమానులు ఈయన చెప్పిన జాతకం పట్ల విమర్శలు చేసిన చివరికి ఆయన చెప్పింది నిజం కావడంతో వేణు స్వామి ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.
సమంత నాగచైతన్య విషయంలోనే కాకుండా పలువురు సెలబ్రిటీల విషయంలో కూడా ఈయన జ్యోతిష్యం నిజం కావడంతో ఈయనకు విపరీతమైన క్రేజ్ లభించింది.
"""/" /
ఇలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీల జాతకాలతో పాటు రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ తరచు వార్తలలో నిలిచేవారు అయితే ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలో అలాగే తెలంగాణ ఎన్నికల సమయంలో వేణు స్వామి చెప్పిన జాతకం పూర్తిగా వ్యతిరేకంగా రావడంతో ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు.
తాను ఇకపై సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చొప్పనని ఒక వీడియో విడుదల చేశారు.
"""/" /
ఇలా సెలబ్రిటీల జాతకాలను సోషల్ మీడియా వేదికగా తెలపనని చెప్పిన వేణు స్వామి ఇచ్చిన మాట తప్పారు.
తాజాగా నాగచైతన్య మరో నటి శోభిత( Sobitha ) తో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.
త్వరలోనే వీరి వివాహం కూడా జరగనున్న నేపథ్యంలో వేణు స్వామి వీరి జాతకం గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా నాగచైతన్య శోభిత దూళిపాళ్ళ వైవాహిక జీవితం గురించి సంచలనాత్మకమైన విశ్లేషణ త్వరలోనే తెలియజేయబోతున్నాను అంటూ వెల్లడించారు.
ఇలా మరోసారి ఈయన నాగచైతన్య శోభిత జాతకం గురించి చెబుతున్నాను అంటూ అందరిలోనూ ఆసక్తి రేపారు.
మరి వీరిద్దరి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాల గురించి వేణు స్వామి ఏం చెబుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది.
హెయిర్ బ్రేకేజ్ కు చెక్ పెట్టే బెస్ట్ అండ్ న్యాచురల్ టానిక్ ఇది.. డోంట్ మిస్!