బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాఖ్యలు వేసిన వేణుస్వామి.. షో గురించి అలా చెబుతూ?

బిగ్ బాస్ షో( Bigg Boss Show ) గురించి మనందరికీ తెలిసిందే.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతూ అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇకపోతే ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లలో విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక గత సీజన్ లో రైతు బిడ్డ అంటూ కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు.

ఆ సంగతి అటు ఉంచితే బిగ్ బాస్ షో ని ఆదరించే వారు ఎంతమంది ఉన్నారో ఆ షో పైన నెగటివ్ గా కామెంట్ చేసే వారు కూడా అంతమందే ఉన్నారు.

"""/" / చాలామంది సెలబ్రిటీలు( Celebrities ) కూడా ఈ షోపై నెగటివ్ గా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

ఇకపోతే త్వరలోనే తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8( Bigg Boss Season 8 ) ప్రారంభం కానుంది.

ఈ షో కి ఈసారి సెలబ్రిటీలతోపాటు సామాన్యులకు రాబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా బిగ్బాస్ 8 లోకి ఆస్ట్రాలజర్ వేణు స్వామి( Astrologer Venu Swamy ) కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెగటివ్ గా స్పందించారు.

ఇన్ని రోజులు బయట జాతకాలు చెప్పిన వేణు స్వామి ఇకపై లోపల కంటెస్టెంట్లకు జాతకాలు చెబుతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

దాంతో సోషల్ మీడియాలో వేణు స్వామిపై సెటైర్స్ మొదలయ్యాయి. """/" / అయితే ఎట్టకేలకు ఈ విషయంపై వేణు స్వామి స్పందిస్తూ బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఛీ బిగ్ బాస్ కా, నేనా అంటూ బిగ్ బాస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.

బిగ్ బాస్ అంటే అదొక చెత్త.దానికి వెళ్ళేవాళ్ళు ఒక ఏడాది పాటు కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తారు.

ఏడాది తిరిగి మరో సీజన్ మొదలయ్యే సరికి వాళ్ళు బిస్కెట్ అవుతారు.గత ఏడాది విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ కానివ్వండి ఎవ్వరైనా కానీ బిగ్ బాస్ వల్ల ప్రయోజనం వారు ఎవ్వరూ పొందలేదు.

నాకు బిగ్ బాస్ కి రమ్మని ఆఫర్ వచ్చింది.ఇప్పుడే కాదు గత ఏడాది కూడా నాకు బిగ్ బాస్ కి రమ్మని ఆఫర్ ఇచ్చారు.

నేను బిగ్ బాస్ కి వ్యతిరేఖిని.అక్కడికెళ్లి నేనేం చేస్తాను అండి అయినా బిగ్ బాస్ కి వెళ్లి లైఫ్ నాశనం చేసుకోవద్దని అందరికి నేనే చెబుతాను.

బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన వాళ్లు అమెరికా ఆట, తానా లలో స్పెషల్ షోస్ చేసుకుంటారు తప్ప ఆ బిగ్ బాస్ వలన వేరే ప్రయోజనం ఉండదు అంటూ వేణు స్వామి బిగ్బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ నటీమణులు ఎంత తక్కువ వయసులో హీరోయిన్లు అయ్యారో తెలిస్తే..?