ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి…

సినీ ప్రముఖుల జీవితాల గురించి జోష్యం చెప్పే వేణు స్వామి( Venu Swamy ) చాలా పాపులర్ అయ్యారు.

అందుకు కారణం అతని చెబుతున్న జోష్యం చాలామంది విషయంలో నిజం కావడమేనని చెప్పవచ్చు.

దాంతో వేణు స్వామి టాలీవుడ్ లో కానివ్వండి, ఇటు రాజకీయంగా కానివ్వండి ఎవరి గురించి ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ చెప్పిన అది తెగ వైరల్ అవుతుంది.

వేణు స్వామి ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ అంటేనే ఫాన్స్ కి ఒణుకు పుడుతుంది అలా ఉంది ఆయన శాస్త్రం .

వేణు స్వామి ఇప్పటివరకు చెప్పిన సెలబ్రిటీస్( Celebrities ) జీవితాలలో నిజం అవడం వల్ల ఆయన భవిష్యత్తు చెప్తాడు అని ఒక నమ్మకం కలిగింది.

అసలు వేణు స్వామి సెలబ్రిటీస్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, ఇలాంటి జాతకాలు చెప్పి ఎందుకు వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నాడు, ఫ్యాన్స్ భయానికి కారణాలేంటి ఇపుడు చూద్దాం .

మరిన్ని వివరాలు తెలుసుకుందాం.వేణు స్వామి మొదటగా నాగచైతన్య,సమంత( Naga Chaitanya, Samantha ) విడిపోతారు అని బాంబు పేల్చాడు అది నిజంగా జరిగింది, వేణు స్వామి చెప్పిన్నట్టే నాగచైతన్య సమంత విడిపోతారని అంచనా వేశారు అప్పట్లో అది సంచలనంగా మారింది.

అయితే అది ఇటీవల నిజమైంది.దాంతో వేణు స్వామి భవిష్యత్తును చూడగల ఒక గొప్ప ఆస్ట్రాలజర్ అనే పేరు పడిపోయింది.

అలాగే వేణు స్వామి మరో టాలీవుడ్ కపుల్స్ పైన సెన్సషనల్ కామెంట్స్ చేసాడు.

"""/" / అంతేకాదు రామ్ చరణ్ ఉపాసన ఆలస్యంగా బిడ్డను కంటారని కూడా ఇతను ఒక ప్రిడిక్షన్ చేశారు అది కూడా నిజమైంది.

అదే విధంగా రెండు నెలల క్రితం అతను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక యువ నటుడు చనిపోతాడు అని కూడా జోష్యం చెప్పాడు.

తారకరత్న రూపంలో అది నిజమైంది.టాలీవుడ్ యాక్టర్స్ ఇద్దరు పెళ్లి చేసుకుంటారని చెప్పగా అది వరుణ్ తేజ్, లావణ్యల విషయంలో నిజమైంది.

"""/" / ఇలా వేణు స్వామి చెబుతున్న చాలా మాటలు నిజమవుతూ అతడిని మరింత పాపులర్ చేస్తున్నాయి.

ఇక రీసెంట్‌గా అతను చెప్పిన మరికొన్ని జోష్యాలు వైరల్ అవుతున్నాయి.వాటిలో ప్రభాస్ 2023 జాతకం బాగోలేదని చెప్పడం ఒకటి ఉంది.

ఇది నిజమవుతుందేమోనని అభిమానులు చాలా బాధపడుతున్నారు.వేణు స్వామి చెప్పిన వాటిలో చాలావరకు చెడు సంఘటలే ఉన్నాయి.

ఆయన చెప్పిన చెడులన్నీ నిజమయ్యాయి.ఇక భవిష్యత్తులో అతను ఇంకెన్ని భయంకరమైన జోష్యాలు చెబుతాడోనని టాలీవుడ్ అభిమానులు బిక్కుబిక్కుమంటున్నారు.

మరికొందరు అభిమానులు చెడు విషయాలను ముందే చెప్పకపోవడం మంచిదని అంటున్నారు.ఇంకొందరు చెడు వదిలేసి మంచి విశేషాలు మాత్రమే చెప్పాలని కోరుతున్నారు.

ఏది ఏమైనా వేణు స్వామి ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ అంటే ఎపుడు ఏ హీరోని టార్గెట్ చేస్తాడో అని తెగ భయపడిపోతున్నారు.

మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులకు భారీ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న రాజమౌళి…