బిగ్ బాస్ ఒక చెత్త షో… బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన వేణు స్వామి?
TeluguStop.com
తెలుగు బుల్లితెరపై ప్రసారం కాబోయే బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది ఈ కార్యక్రమం త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది.
ఇప్పటివరకు ఏడు సీజన్లో పూర్తి అయ్యి ఈ కార్యక్రమం ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
ఇక సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ఎనిమిదవ సీజన్ కూడా ప్రసారం కాబోతుందని తెలుస్తుంది.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో ప్రోమోలు విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించి చర్చి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
"""/" /
బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎనిమిదవ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈసారి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వారు వివాదాలలో నిలిచిన వారిని తీసుకోబోతున్నారని తెలుస్తోంది.
ఇక ఈ కార్యక్రమంలో ఈసారి ప్రముఖ వివాదాస్పద ఆస్ట్రాలజర్ వేణు స్వామి( Venu Swamy ) కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
"""/" /
ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలోనే ఎవరు అందుకొని రెమ్యూనరేషన్( Remuneration ) వేణు స్వామి అందుకోబోతున్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.
అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఈ వార్తల గురించి క్లారిటీ ఇచ్చారు.
బిగ్ బాస్ షో ఒక చెత్త షో ఆ కార్యక్రమం అంటే నాకు నచ్చదు ఎవరైనా వెళ్తున్నారు అంటే వారికి వెళ్ళొద్దని నేను సలహాలు ఇస్తాను అలాంటిది నేనెలా వెళ్తాను అంటూ ఈయన ఈ కార్యక్రమం గురించి క్లారిటీ ఇచ్చారు.
ఇలా వేణు స్వామి ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వడంతో పలువురు నేటిజన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి వెళ్తే మీరు ఓడిపోతారని మీ జాతకంలో ఉందా.అందుకే వెళ్లలేదా అంటూ కామెంట్లో చేస్తున్నారు.
ఈ హిట్ సినిమాల్లో ఈ సెలబ్రిటీస్ కూడా నటించారా.. కనిపించలేదే..?