Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ఆస్తుల విలువ ఏకంగా అన్ని రూ.కోట్లా.. ఆ రేంజ్ లో సంపాదించాడా?

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆస్ట్రాలజర్ వేణు స్వామి( Astrologer Venu Swamy ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తరచూ సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు వేణు స్వామి.

ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు స్టార్ హీరోల జాతకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి లేనిపోని వివాదాలను కాంట్రవర్సీలను కొని తెచ్చుకున్న విషయం తెలిసిందే.

హీరో హీరోయిన్ల అభిమానులు వేణు స్వామి పై దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేశారు.

కాగా ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంది.

వేణు స్వామి చేసే వ్యాఖ్యలు యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి.

కొన్నిసార్లు వేణు స్వామి చెప్పే జాతకాలు బెడిసి కొట్టడం వివాదంగా మారడం చూస్తూనే ఉన్నాం.

బాహుబలి తర్వాత ప్రభాస్ కి( Prabhas ) ఇక కెరీర్ ఉండదని గతంలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

అయితే సలార్( Salaar ) హిట్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామినీ ట్రోల్ చేశారు.

ఎవరు ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ నెగిటివ్ కామెంట్స్ చేసినా కూడా వేణు స్వామి మాత్రం తన పద్ధతిని మార్చుకోలేదు.

కాగా వేణు స్వామి చెప్పే జాతకాలని వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు.వేణు స్వామికి నిజంగానే అంత బాగా జాతకాలు తెలిస్తే తనని తాను బాగు చేసుకోవచ్చు కదా ఎందుకు జాతకాలు చెప్పుకుంటున్నారు అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు.

"""/" / ఈ ప్రశ్నలకు వేణు స్వామి తాజాగా ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు.

తాజాగా తన వ్యక్తిగత విషయాల గురించి ఇతను ఆస్తిపాస్తుల గురించి ఇంటర్వ్యూలో మాట్లాడారు వేణు స్వామి.

వేణు స్వామి ఆస్తుపాస్తుల( Venu Swamy Assets ) గురించి తెలిస్తే మాత్రం దిమ్మతిరగాల్సిందే.

ఆయన అంత పెద్ద కోటేశ్వరుడా అని ఆశ్చర్యపోతారు.ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ.

నాకు జాతకం చెప్పడం ద్వారా మాత్రమే డబ్బులు రావు.సినిమా సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు నా దగ్గరకి వస్తారు.

సామాన్య జనాలకు కూడా సమయం కేటాయిస్తున్నాను.ఇవి కాకుండా నాకు అనేక వ్యాపారాలు ఉన్నాయి.

రియల్ ఎస్టేట్ బిజినెస్( Real Estate Business ) చేస్తాను.నాకు ఒక పబ్, ఒక వైన్ షాప్, రేంజ్ రోవర్ కారు ఇంకా ఇతర వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పుకొచ్చారు వేణు స్వామి.

"""/" / జ్యోతిష్యం చెప్పే వాడి జాతకం బావుంటే జ్యోతిష్యం ఎందుకు చెప్పుకుంటాడు అని వాగే వారికి నా సంపాదనే సమాధానం.

నా రేంజ్ ఇది అని వేణు స్వామి అన్నారు.నాతో పాటు నా భార్య కూడా సంపాదిస్తుంది.

ఆమె సంగీతంలో ప్రావీణ్యురాలు.ఎవరైనా భార్య మీద ప్రేమతో కసిగా సంపాదిస్తారు.

తాను కూడా తన భార్య వీణా శ్రీవాణిపై( Veena Srivani ) ప్రేమతో ఇంత సంపాదించినట్లు వేణు స్వామి ఫన్నీగా అన్నారు.

ప్రతి నెల తాను జీఎస్టీ ట్యాక్సులు కూడా కడుతున్నట్లు వేణు స్వామి తెలిపారు.

మొత్తంగా వేణు స్వామి మాట్లాడిన మాటలు బట్టి చూస్తే ఆయన ఇప్పటివరకు కోట్లు సంపాదించినట్టుగా తెలుస్తోంది.

అలవోకగా పద్యం పాడిన అల్లు అర్హ.. ఈ చిన్నారిని ఎంత మెచ్చుకున్నా తక్కువే!