ఆగిపోయిన సినిమాకు ప్రాణం పోసిన బన్నీ డైరెక్టర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.

తన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్న బన్నీ, ఇప్పుడు మరోసారి తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా పుష్ప సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమా తరువాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో బన్నీ తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

అయితే బన్నీ గతంలోనే ఓ సినిమాను అనౌన్స్ చేయగా, ప్రస్తుతం అది అటకెక్కినట్లు వార్తలు వినిపించాయి.

కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ అంటున్నారు.

‘ఐకాన్’ అనే సినిమాను తెరకెక్కించేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఐకాన్ సినిమాపై అప్పట్లోనే మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

అయితే త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ‘అల వైకుంఠపురములో’ సినిమాను తెరకెక్కించే క్రమంలో బన్నీ ఐకాన్ సినిమాను పక్కనబెట్టాడు.

దీంతో ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కుతుందో లేదో అని అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమా ఖచ్చితంగా రాబోతుందని, దర్శకుడు వేణు శ్రీరామ్ తెలిపారు.

ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రంతో బిజీగా ఉన్న ఆయన, ఈ సినిమా పూర్తవ్వగానే బన్నీతో ఐకాన్ సినిమా కోసం పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలోనే ఈ సినిమా స్క్రిప్టును పూర్తి చేసి బన్నీకి మరోసారి వినిపించాక సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

పాయల్ లాంటి హీరోయిన్ మాట సరే.. మరి నయన్ లాంటి స్టార్స్ కి రూల్స్ లేవా ?