వెన్నెల కిషోర్ తన ఇన్వెస్టిగేషన్ తో మెప్పించాడా? ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ ఎలావుందంటే..
TeluguStop.com
తెలుగు కమెడియన్ వెన్నెల కిశోర్ ( Vennela Kishore )హీరోగా, హీరోయిన్ అనన్య నాగళ్ల( Ananya Nagalla ) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’.
రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రమణా రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.
ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం.
"""/" /
ఇక సినిమాలు నటీనటుల ప్రదర్శన పరంగా చూస్తే.వెన్నెల కిశోర్ డిటెక్టివ్ పాత్రలో తనదైన స్టైల్‌లో ఆకట్టుకున్నారు.
ఆయన పాత్రలోని తెలివితేటలు, భావోద్వేగాలు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అనన్య నాగళ్ళ, రవి కూడా వారు తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు.ఈ సినిమాలో పాటలు ప్రత్యేకంగా చెప్పాలి.
ప్రతి పాట కథను ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఇక టెక్నికల్, డైరెక్షన్ పర్ణగా చూస్తే.
దర్శకుడు రచయిత మోహన్ ( Director Writer Mohan )ఈ చిత్రాన్ని ఒక సాధారణ డిటెక్టివ్ ( Detective )కథగా కాకుండా మానవ సంబంధాల లోతులు, భావోద్వేగాలతో నిండిన అనుభూతిగా మలిచారు.
ప్రేమ, నమ్మకం, నిజాయితీకి సంబంధించిన అంశాలను హృదయాలను తాకేలా చూపించారు.మొత్తం మీద, యూనివర్సల్ ఆలోచనలు కలిగిఉన్నట్లుగా సినిమాను తెరకెక్కించారు.
మరోవైపు సినిమాటోగ్రఫీ ఎమోషన్‌ను బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది. """/" /
ఇక సినిమాలో ప్లస్‌లు విషయం పరంగా చెప్పాలంటే.
సినిమలో అద్భుతమైన ట్విస్టులు, గూఢచారి కథ మెప్పిస్తాయి.ఇంకా భావోద్వేగాలను హార్ట్ టచ్చింగ్‌గా చూపిన స్క్రీన్ ప్లే విధానం.
వారిపరిధిలో నటీనటుల అద్భుతమైన ప్రదర్శన బాగానే ఉన్నాయి.ఇక కథను ముందుకు తీసుకువెళ్లే పాటలు బాగా కధలో లీనమయ్యాయి.
ఇక సినిమాలో ఉండే ఎమోషన్ కొందరికి కనెక్ట్ కాకపోవడం మైనస్ అని చెప్పవచ్చు.
మొత్తానికి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా ఓ ఆత్మీయమైన, భావోద్వేగాల కథను డిటెక్టివ్ కథతో మిళితం చేస్తుంది.
ఈ చిత్రం మిస్టరీ, ఎమోషన్స్, హాస్యాన్ని మిక్స్ చేసి చూపించడంతో ఈ వారాంతంలో ప్రేక్షకులకు మంచి చాయిస్‌గా నిలుస్తుంది.
చివరగా.హాస్యం, మిస్టరీ, సెంటిమెంట్ సమ్మేళనమే" శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ".
వామ్మో.. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఇన్ని జబ్బులా..?