ఏంటి 'మామ' మరీ ఇంత ఆలస్యం?

ఈ ఏడాది ఆరంభంలో వెంకటేష్‌ 'ఎఫ్‌ 2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ కూడా నటించినా కూడా ప్రేక్షకులు పూర్తిగా వెంకటేష్‌ను మాత్రమే చూశారు.

సినిమా మొత్తం కూడా వెంకటేష్‌ నడిపించాడనే టాక్‌ వచ్చింది.ఇంతటి సక్సెస్‌ను దక్కించుకున్న వెంకీ తదుపరి 'వెంకీమామ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అయితే వెంకీ మామ గురించిన వార్తలు దాదాపు ఏడాదిన్నర నుండి వస్తున్నాయి.అయినా ఇంకా ఒక కొలిక్కి రాలేదు.

నాగచైతన్య మరియు వెంకటేష్‌ లు కలిసి నటిస్తున్న 'వెంకీ మామ' చిత్రం నుండి ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ వచ్చింది.

అయితే సినిమాకు సంబంధించిన విషయాలను మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యి చాలా నెలలు అయ్యింది.

అయినా ఇంకా కూడా ఎలాంటి క్లారిటీ రావడం లేదు.సినిమాను మొదట జూన్‌ లేదా జులైలో విడుదల చేస్తారని అంతా భావించారు.

కాని ఇప్పుడు సంక్రాంతి వరకు కూడా సినిమా వచ్చేలా కనిపించడం లేదు అంటున్నారు.

"""/"/ 'వెంకీమామ' చిత్రం షూటింగ్‌ విడుదల ఎప్పుడు అనే విషయంపై దర్శకుడు బాబీ క్లారిటీ ఇవ్వాలంటూ వెంకటేష్‌ ఫ్యాన్స్‌ కోరుతున్నారు.

ఈ చిత్రంలో వెంకీ లుక్‌ చాలా విభిన్నంగా ఉంటుందనే టాక్‌ కూడా వినిపిస్తుంది.

మామ అల్లుడు మొదటి సారి కలిసి నటిస్తున్న కారణంగా అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.

దానికి తోడు జై లవకుశ చిత్రం తర్వాత దర్శకుడు బాబీ చేస్తున్న సినిమా ఇదే అవ్వడం వల్ల కూడా ఆసక్తి నెలకొంది.

మరి ఈ చిత్రం ఎప్పుడు వస్తుంది? ఎందుకు ఇంత ఆలస్యం అనే విషయాలపై యూనిట్‌ సభ్యులు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో నందమూరి బాలకృష్ణ పర్యటన..