వెంకటేష్, నాగచైతన్య నటిస్తున్న 'వెంకీమామ' చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.గత రెండు మూడు నెలలుగా ఈ సినిమా విడుదల అదుగో ఇదుగో అంటూ దాటవేస్తూ వస్తున్నారు.
ఎట్టకేలకు ఈ సినిమాను విడుదల చేసేందుకు డేట్ ప్రకటించారు.అయితే విడుదల తేదీ మరో పది రోజులు కూడా లేకపోవడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.
సినిమా ప్రమోషన్ ఏమాత్రం లేకుండానే వెంకీ మామను సడెన్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
వెంకీమామ చిత్రంలో వెంకటేష్ మామగా నాగచైతన్య అల్లుడి పాత్రలో కనిపించబోతున్నారు.వీరిద్దరు నిజ జీవితంలో కూడా మామ అల్లుడు అనే విషయం తెల్సిందే.
వీరిద్దరి కాంబోలో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.ఇక ఈ చిత్రంకు బాబీ దర్శకత్వం వహించగా రాశిఖన్నా మరియు పాయల్ రాజ్‌పూత్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉండబోతున్న ఈ సినిమాను ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.