వెంకీ-నితిన్ స్టోరీ లీక్.. కథ ఇదేనంటూ ప్రచారం!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నితిన్ ఒకరు.నితిన్ గత సంవత్సరం విడుదలైన భీష్మ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేసాడు.ఈ సినిమా అటు నితిన్ కెరీర్ కు ఇటు వెంకీ కెరీర్ కు ప్లస్ అయ్యింది.

అయితే ఈ సినిమా తర్వాత వెంకీ కుడుముల ఇంత వరకు మరొక సినిమాను మొదలు పెట్టలేదు.

ఇప్పటికే చాలా మంది హీరోలు పేర్లు వినిపించిన ఒక్కరితో కూడా సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించలేదు.

గత కొన్ని రోజులుగా వెంకీ కుడుముల నితిన్ తో మరొక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక తాజాగా వీరి సినిమా గురించి మరొక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా కథ ఇదేనంటూ నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది.

ఒక ప్రాణాంతకమైన డిసీజ్ తో చావుకి దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి కథ ఇది అని టాక్ వస్తుంది.

మరో నెల రోజుల్లో చనిపోతాను అని తెలుసుకున్న వ్యక్తి ఎలా ఫీల్ అయ్యాడు.

తన జర్నీని ఎలా మలచు కున్నాడు? ఆయనపై అందరు చూపించే సింపతీకి అతడు ఎలా ఇరిటేట్ అయ్యాడు? అనే కథను వెంకీ రాసుకున్నట్టు అది కూడా కొద్దిగా ఫన్నీ వేలో చూపించ బోతున్నాడట.

"""/" / వెంకీ కుడుముల ఇప్పటికే నితిన్ కు కథ కూడా వినిపించాడని అతడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది.

కాగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించ బోతుందట.

ఛలో, భీష్మ వంటి బ్లాక్ బస్టర్స్ తో మంచి ఊపు మీద ఉన్న వెంకీ కుడుముల సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తినే ఉంది.

మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో చూడాలి.

భారత సంతతి నిర్మాతకు వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో అరుదైన గౌరవం