ధనుష్ మరో తెలుగు సినిమా డైరక్టర్ అతనేనా..?

కోలీవుడ్ హీరో ధనుష్ తెలుగులో సినిమాలకు లైనప్ చేస్తున్నాడు.ఆల్రెడీ శేఖర్ కమ్ముల డైరక్షన్ లో ఓ సినిమా ఫిక్స్ చేసుకున్న ధనుష్ మరో సినిమాను చేయాలని చూస్తున్నాడట.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని టాక్.ధనుష్ చేస్తున్న రెండో తెలుగు సినిమా కూడా తెలుగుతో పాటుగా తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకు దర్శకుడిగా వెంకీ అట్లూరి పేరు డిస్కషన్స్ లో ఉంది.

సితార బ్యానర్ లో సినిమాలు చేసిన వెంకీ తోనే ధనుష్ సినిమా ఉండబోతుందని టాక్.

వెంకీ అట్లూరి డైరక్షన్ లో ధనుష్ సినిమా.కాంబో నిజంగానే థ్రిల్లింగ్ గా ఉంది.

వెంకీ కేవలం లవ్ స్టోరీస్ మాత్రమే డీల్ చేస్తాడు.తొలిప్రేమ, మిస్టర్ మజ్ ను, రంగ్ దే ఈ మూడు సినిమాలతో తనకంటూ ఒక మార్క్ ఏర్పాటు చేసుకున్నాడు.

అయితే ఇలాంటి డైరక్టర్ ధనుష్ కు ఎలాంటి కథ రాసి ఉంటాడన్నది చర్చల్లోకి వస్తుంది.

సితార బ్యానర్ లో ధనుష్ సినిమా అనగానే డైరక్టర్ వెంకీ అట్లూరి అంటూ వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.

 ధనుష్ తో పాటు విజయ్, సూర్య తమిళ హీరోలు కూడా తెలుగులో సినిమాలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

దగ్గును తరిమికొట్టే బెస్ట్ హెర్బల్ టీ ఇది.. డోంట్ మిస్!