ఆ సినిమా కథ చెబితే తెలుగు హీరోలందరూ రిజెక్ట్ చేశారు: వెంకీ అట్లూరి

వెంకీ అట్లూరి ( Venky Atluri ) ఇటీవల దుల్కర్ సల్మాన్ ( Dulquer Salman ) హీరోగా లక్కీ భాస్కర్ ( Lucky Bhaskar ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని ప్రస్తుతం ఓటీటీలో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వెంకీ అట్లూరి పై భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి.

ఈయన తెలుగు హీరోలతో రొటీన్ లవ్ స్టోరీ సినిమాలను చేస్తూ ఇతర భాష హీరోలతో మాత్రం ఎంతో విభిన్నమైన అద్భుతమైన కథ చిత్రాలతో సినిమాలు చేస్తున్నారు అనే విమర్శలు వచ్చాయి.

"""/" / గతంలో హీరో ధనుష్ ( Danush ) తో సార్ ( Sir ) అనే సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమా చేసి మరో హిట్ అందించారు.

ఈ క్రమంలోనే ఈయనపై విమర్శలు వస్తున్న తరుణంలో వెంకీ అట్లూరి స్పందించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ సార్ సినిమా కథ ధనుష్ కంటే ముందుగా కూడా మన తెలుగు హీరోలకు తాను చెప్పానని తెలిపారు.

ఎంతోమంది హీరోలకు ఆ సినిమా కథ చెబితే ఎవరూ కూడా సినిమా చేయటానికి ఒప్పుకోలేదు.

"""/" / ఈ సినిమా కథ మొత్తం విన్న తర్వాత హీరోలు హ్యాపీ ఎండింగ్ లేదు.

ప్యాసివ్‌గా ఉంది.సోల్ లేదు అంటూ ఇలా చాలా అన్నారు.

అందుకే నేను తమిళ్‌లోకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.అయితే తమిళంలో ముందుగా ధనుష్ ను కలిసి ఈ సినిమా స్టోరీ చెప్పగానే ఆయన వెంటనే ఎప్పటినుంచి స్టార్ట్ చేద్దామని  అడిగారని వెంకీ అట్లూరి తెలిపారు.

ఆయన అలా అడగడంతో నాలో మరింత కాన్ఫిడెన్స్ పెరిగిందని తెలిపారు.తెలుగు హీరోలు, నిర్మాతలు అందరికీ కూడా ఓ హ్యాపీ ఎండింగ్ కావాలి.

థియేటర్ నుంచి ప్రేక్షకుడు బయటకు వెళ్లేటప్పుడు ఓ హ్యాపీ ఫేస్‌తో వెళ్లాలని అనుకుంటారని ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

పుష్ప2 రికార్డులను వార్2 బ్రేక్ చేయడం సాధ్యమేనా.. థియేటర్లు కళకళలాడుతున్నాయా?