డీవీడీ షాప్స్ లో కాసుల వర్షం కురిపించిన వెంకటేష్ సినిమా అదే ..ఇప్పటికీ ఈ రికార్డు అన్ బీటబుల్!

మన టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఆరోజుల్లో శోభన్ బాబు గురించి వినేవాళ్ళం.ఆయనకీ ఫ్యామిలీ ఆడియన్స్ మరియు లేడీస్ ఫాలోయింగ్ ఎవరికీ లేదు అనేవారు.

మళ్ళీ అలాంటి హీరో ని చూస్తామో లేదో భవిష్యత్తులో అని అనుకునేవారు.కానీ ఆయన తర్వాతి తరం లో విక్టరీ వెంకటేష్ ఆయనకీ మించి పీక్ ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ని దక్కించుకున్నాడు.

ఆయన ఇప్పటి వరకు 74 సినిమాలు చేస్తే అందులో అత్యధికంగా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినవే ఉన్నాయి.

వీటిల్లో కేవలం క్లాస్ సినిమాలు మాత్రమే లేదు.యూత్ కి నచ్చే సినిమాలు, మాస్ కి నచ్చే సినిమాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి.

అందుకే వెంకటేష్ సినిమా హిట్ అయితే అన్నీ వర్గాల ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూలు కడుతుంటారు.

"""/" / అలా విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) హీరో గా నటించిన సినిమాలలో ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన చిత్రం 'చంటి'.

( Chanti )తమిళం లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన 'చిన్న తంబీ' అనే చిత్రానికి రీమేక్ గా వచ్చింది ఈ చిత్రం.

తమిళం లో ప్రభు హీరో గా నటించాడు, తమిళం లో కంటే కూడా తెలుగులోనే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది.

అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.

అమాయకుడిగా వెంకటేష్ నటించిన నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు అప్పట్లో పెద్ద సెన్సేషన్.

ఎక్కడ చూసిన ఈ చిత్ర పాటలే వినిపిస్తూ ఉండేవి.అప్పట్లో ఇప్పటి లాగ ఓటీటీ లు ఉండేవి కాదు.

సినిమా ఇంట్లో కూర్చొని చూడాలంటె కచ్చితంగా డీవీడీ ఒక్కటే ఛాయస్.రెంట్ కి డీవీడీ లు ఇచ్చేవారు అప్పట్లో.

"""/" / అలా రెంటెడ్ డీవీడీ( DVD ) లతో ఈ సినిమా అప్పట్లో డీవీడీ షాప్ ఓనర్స్ కి కాసుల వర్షం కురిపించింది.

కేవలం డీవీడీ లతోనే ఈ సినిమా అప్పట్లో కోటి పైగా లాభాలను ఆర్జించింది అట.

ఇది ఆల్ టైం అన్ బీటబుల్ రికార్డు.ఇప్పటికీ ఈ రికార్డు ని టచ్ చేసిన హీరో లేదంటే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ అనేది.

ఈ చిత్రం తర్వాతి స్థానం లో అక్కినేని నాగార్జున( Nagarjuna ) హీరో గా నటించిన 'హలో బ్రదర్' ( Hello Brother )చిత్రం నిల్చింది.

2014 వ సంవత్సరాం వరకు ఈ డీవీడీ ట్రెండ్ కొనసాగుతూ ఉండేది.ఆ తర్వాత సోషల్ మీడియా, ఓటీటీ వృద్ధి చెందడం తో ఈ ట్రెండ్ మాయం అయిపోయింది.

హాయ్ నాన్న మూవీపై కాపీ ఆరోపణలు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు వైరల్!