ఎఫ్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా.. అన్ని కోట్లు వచ్చాయా!
TeluguStop.com
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ప్రెసెంట్ తెరకెక్కించిన సినిమా 'ఎఫ్ 3'.
ఈ సినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఎఫ్ 3 సినిమాను స్టార్ట్ చేసాడు.
ఈ సినిమా ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.
వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటిస్తున్నారు.దేవిశ్రీ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను శిరీష్ నిర్మించారు.
ఇక ఈ సినిమా తొలిరోజు నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.దీంతో చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ అయ్యాయి.
మరి ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ రాబట్టిందో తెలుసుకుందాం.ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 10.
37 కోట్ల షేర్ రాబట్టింది అంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు.ఇక ఓవర్సీస్ లో కూడా హాఫ్ మిలియన్ వసూలు చేసిందట.
ఈ సినిమాలో కథ లేకపోయినా ప్రేక్షకులు మెచ్చే వినోదం ఉండడంతో కావలిసినంత ఫన్ కోసం ఈ సినిమాను చూడడానికి ఇష్టపడుతున్నారు.
"""/"/
వెంకటేష్, వరుణ్ తేజ్, అలీ, సునీల్ కామెడీ కూడా బాగా పండింది.
అందులోను చాలా రోజుల తర్వాత కుటుంబం మొత్తం ఒకదగ్గర చూడగలిగే సినిమా కావడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.
ఈ సినిమా వీకెండ్ ముగిసే సమయానికి మంచి కలెక్షన్స్ సాధిస్తుంది అంచనా వేస్తున్నారు.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత రాబట్టింది అంటే.నైజాం - 4.
06 కోట్లు,
ఉత్తర ఆంధ్ర - 1.18 కోట్లు,
నెల్లూరు - 62 లక్షలు,
గుంటూరు - 88 లక్షలు,
వెస్ట్ - 94 లక్షలు,
ఈస్ట్ - 76 లక్షలు,
కృష్ణ - 67 లక్షలు,
సీడెడ్ - 1.
26 కోట్లు,
మొత్తం షేర్ - 10.37 కోట్లు రాబట్టింది.
మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.
మా వాడైన పరాయి వాడే… సంచలనం రేపుతున్న నాగబాబు కామెంట్స్!