గుసగుస : ఎఫ్ 3 రాకుండానే 'ఎఫ్ 4'.. తుది నిర్ణయం అప్పుడే?
TeluguStop.com
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.
అనిల్ రావిపూడి తనదైన మార్క్ టైమింగ్ తో, డైలాగ్ లతో వరుస విజయాలను అందు కుంటున్నాడు.
ప్రెసెంట్ అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.
ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఎఫ్ 3 సినిమాను స్టార్ట్ చేసాడు.
ఎఫ్ 3 సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.
వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటిస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ పాటలు అన్ని కూడా అలరించాయి.
ఇక ఇటీవలే మరో పాట కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు మేకర్స్.
ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే ఇప్పుడు ఎఫ్ 4 సినిమా తెరమీదకు వచ్చింది.
"""/"/ అనిల్ ఎఫ్ 3 మీద నమ్మకంతోనే ఎఫ్ 4 కూడా రెడీ చేస్తున్నట్టు గుసగుస వినిపిస్తుంది.
ఈ విషయం ఎంత నిజమో తెలియదు కానీ ఇప్పుడు ఈ వార్త మాత్రం నెట్టింట వైరల్ అయ్యింది.
ఎఫ్ 4 సినిమా ఉండాలి అంటే ఎఫ్ 3 మీదనే ఆధారపడి ఉంది.
ఈ సినిమా విజయం సాధిస్తే మరో పార్ట్ వచ్చే అవకాశం ఉంది. """/"/
ఈ వార్త నిజమయ్యి ఒకవేళ ఎఫ్ 4 ఉన్నా కూడా ఇప్పుడప్పుడే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం లేదు.
ఎందుకంటే అనిల్ ఎఫ్ 3 సినిమా తర్వాత లైన్లో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు.
బాలయ్య కోసం ఒక సిద్ధం చేస్తున్నాడు.అలాగే మహేష్ బాబు తో మరో సినిమా చేయాలి.
అలాగే ఎన్టీఆర్ తో కూడా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇలా స్టార్ హీరోల సినిమాలు పూర్తి అయితే కానీ ఎఫ్ 4 సినిమా స్టార్ట్ అవ్వదు.