ఎఫ్3.. ఆ విషయాన్ని నొక్కి చెబుతున్న టీమ్
TeluguStop.com
వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా మరియు మెహ్రీన్ ఇంకా సోనాల్ చౌహాన్ లు హీరోయిన్స్ గా సునీల్, రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ఎఫ్ 3.
ఈ సినిమా కు అనీల్ రావిపూడి దర్శకత్వం వహించగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించాడు.
సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.సినిమా చాలా పాజిటివ్ బజ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కారణం ఏంటీ అంటే ఎఫ్ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
పాతిక ముప్పై కోట్ల బడ్జెట్ తో రూపొంది ఎఫ్ 2 సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుంది.
అందుకే ఎఫ్ 3 సినిమా ఖచ్చితంగా అదే స్థాయి లో వినోదాన్ని పంచుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఇటీవల విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్.
ఆచార్య.సర్కారు వారి పాట ఇంకా కొన్ని సినిమా లకు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున టికెట్ల రేట్లను పెంచారు.
కాని ఎఫ్ 3 సినిమాకు మాత్రం టికెట్ల రేట్లను పెంచడం లేదని క్లారిటీ ఇచ్చారు.
టికెట్ల రేట్ల పెంపు అవకాశం ఉన్నా కూడా పెంచే ఉద్దేశ్యం లేదు అంటూ దిల్ రాజు స్వయంగా ప్రకటించాడు.
పలు వీడియోలు చేస్తూ కూడా ఎఫ్ 3 సినిమాను నార్మల్ టికెట్ల రేట్లకే చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు.
"""/"/ మొత్తానికి ఎఫ్ 3 సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువ అవ్వాలనే ఉద్దేశ్యంతో టికెట్ల రేట్లను పెంచడం లేదని వారు క్లారిటీ ఇస్తున్నారు.
ఎఫ్ 3 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే అనీల్ రావిపూడి తదుపరి సినిమా బాలయ్య తో వెంటనే ప్రారంభం కాబోతుంది.
ఆ సినిమా పై ఖచ్చితంగా అంచనాలు పీక్స్ లో ఉంటాయి.మరో వైపు ఎఫ్ 4 సినిమా కూడా ఉంటుందని యూనిట్ సభ్యులు ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేశారు.
నా భర్తను బాగా మిస్ అవుతున్నా.. గుర్తొస్తే అలా చేస్తా.. రకుల్ క్రేజీ కామెంట్లు వైరల్!