Venkatesh Daggubati: దగ్గుబాటి ఇంట పెళ్లి వేడుక… ఘనంగా వెంకటేష్ రెండో కుమార్తె వివాహం… వరుడు ఎవరంటే?
TeluguStop.com
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉండే ఫ్యామిలీలలో పెద్ద ఎత్తున పెళ్లి వేడుకలు జరగబోతున్న సంగతి మనకు తెలిసింది.
ఇప్పటికే మెగా ఇంటిలో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి.కీరవాణి అలాగే మురళీమోహన్ కూడా వియ్యంకులు కాబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీ సింహకు మురళీమోహన్ మనవరాలతో వివాహం జరగబోతుంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇలా వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నటువంటి తరుణంలోనే మరో ఇంట పెళ్లి భాజాలు మోగబోతున్నాయని తెలుస్తుంది.
సినీ ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబాలలో దగ్గుబాటి కుటుంబం(Daggubati Family) ఒకటి.
దగ్గుబాటి రామానాయుడు కుమారుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు నటుడు వెంకటేష్ (Venkatesh) ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక త్వరలోనే వెంకటేష్ రెండవ కుమార్తె వివాహం కూడా జరగబోతుందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వెంకటేష్ నలుగురు సంతానం అనే విషయం మనకు తెలిసిందే.ఇందులో ముగ్గురు అమ్మాయిలు కాగా ఒక అబ్బాయి ఉన్నారు.
ఇప్పటికే పెద్దమ్మాయి ఆశ్రితకు వివాహం చేసి చాలా సంవత్సరాలు అయింది. """/" /
ఇక ఆశ్రిత( Aashrita ) వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
ఈ క్రమంలోనే వెంకటేష్ తన రెండవ కుమార్తెకు కూడా పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకున్నారట.
ఇలా త్వరలోనే వెంకటేష్ రెండవ కుమార్తె వివాహం కూడా పెద్దలు నిశ్చయించిన అబ్బాయితోనే జరగబోతుందని ఒక వార్త వైరల్ గా మారింది.
అయితే వెంకటేష్ కి కాబోయే అల్లుడు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ అది నిజం కాదని తెలుస్తోంది.
వెంకటేష్ రెండో కుమార్తెను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఒక పెద్ద డాక్టర్( Doctor ) అని సమాచారం.
"""/" /
విజయవాడకి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయికి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడట వెంకటేష్.
ఇలా వైద్య వృత్తిలో స్థిరపడి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అబ్బాయిని తన ఇంటి అల్లుడిగా చేసుకోబోతున్నారని సమాచారం.
ఇండస్ట్రీలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం వెంకటేష్ కుమార్తె నిశ్చితార్థం ఈ నెలలోనే జరగబోతుందని తెలుస్తోంది.
"""/" /
వెంకటేష్ కుమార్తె పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం వైరల్ గా మారింది.
అయితే రానా సోదరుడు అభిరామ్ (Abhi Ram) వివాహం కూడా జరగబోతుంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే.
స్వయాన రామానాయుడు తమ్ముడి మనవరాలితో అభిరామ్ వివాహం జరగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.
మరి ఈ పెళ్లి వార్తల గురించి దగ్గుబాటి కుటుంబం ఎక్కడ కూడా స్పందించలేదు.
మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనే విషయం తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
ఈ సంవత్సరం స్టార్ హీరోలకు బాగా కలిసివచ్చిందా..?