‘సైంధవ్’ షూట్ పై అప్డేట్.. రెండు షెడ్యూల్స్ పూర్తి.. నెక్స్ట్ ఎక్కడంటే?

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీ అయిన 75వ ప్రాజెక్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాడు.

ఈ సినిమాపై ఎప్పుడు లేనంత అంచనాలు ఉన్నాయి.ఎందుకంటే ఈయన హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమాను ప్రకటించాడు.

''సైంధవ్( Saindhav )'' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇప్పటికే అంచనాలు పెరిగాయి.

వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాను పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తుండడం విశేషం.

నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

కాగా ఈ సినిమాలో వెంకీకి జోడీగా కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ ఫైనల్ అయ్యింది.

ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

"""/" / ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రద్ధ శ్రీనాథ్( Shraddha Srinath )సైంధవ్ షూట్ పై అప్డేట్ తెలిపింది.

సోషల్ మీడియా వేదికగా ఈ భామ ఈ సినిమా షూట్ పై క్లారిటీ ఇచ్చింది.

ఈ సినిమాను శైలేష్ కొలను అనుకున్నట్టుగానే షూట్ పూర్తి చేసుకుంటూ పోతున్నట్టు తెలుస్తుంది.

ఈ షూట్ ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకోగా రెండవ షెడ్యూల్ కూడా తాజాగా పూర్తి అయినట్టు చెప్పింది.

"""/" / ఈ షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరిగినట్టు కూడా కన్ఫర్మ్ చేసింది.

దీంతో అనుకున్న సమయంలోనే ఈ షూట్ పూర్తి కానుంది.మరి నెక్స్ట్ షెడ్యూల్ గురించి ఎప్పుడు అప్డేట్ ఇస్తారో వేచి చూడాల్సిందే.

ఇక ఈ సినిమా బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ అని చేతబడి అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు టాక్.

మరి ఈ కథతో శైలేష్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి.