Victory Venkatesh : హీరోయిన్లతో గొడవ పడుతున్న స్టార్ హీరో….మాటలు కూడా లేవట?
TeluguStop.com
టాలీవుడ్ లో ఎటువంటి వివాదాలలో చిక్కుకోకుండా, తన పని తానూ చేసుకుంటూ అందరితో సరదాగా ఉంటారు అనే పేరు ఉంది మన స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ( Victory Venkatesh )కి.
35 ఏళ్ళ తన సినీ కెరీర్ లో సుమారు 70 చిత్రాలలో నటించిన వెంకటేష్ అనేకమంది హీరోయిన్లతో నటించారు.
అందరు హీరోయిన్ లతో సఖ్యతతో మెలిగే ఈ హీరోకు, నలుగురు హీరోయిన్లతో మాత్రం వివాదాలు ఉన్నాయట.
అనేక విషయంలో వెంకటేష్ తో వారు గొడవ పడ్డారని.వీరికి వెంకటేష్ కు మధ్య మాటలు కూడా లేవని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరు? వీరికి వెంకటేష్ లాంటి సౌమ్యుడికి మధ్య గొడవేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
వెంకటేష్ "పోకిరి రాజా" ( Pokiri Raja )అనే చిత్రంలో హీరోయిన్ గా నటించారు రోజా( Roja ).
రోజా ఆ సమయంలో ఒక తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా రీమేక్ చేద్దమనుకున్నారు.
అప్పుడు హీరోయిన్ గా తమిళ్ లో నటించిన రోజానే తీసుకోవాలని మొదట నిర్ణయించుకున్నారు మేకర్స్.
కానీ తరువాత రోజా స్థానంలో సౌందర్యను( Soundharya ) ఫైనల్ చేసారు.ఈ అవకాశం తనకు రాకపోవడానికి కారణం వెంకటేష్ అని రోజా అపోహపడ్డారట.
అంతే.అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య మాటలు లేవట.
"""/" /
మల్లీశ్వరి చిత్రంలో వెంకటేష్ సరసన కత్రినా కైఫ్( Katrina Kaif ) నటించింది.
ఆ సినిమా షూటింగ్ సగం పూర్తయ్యాక, తనకు అధిక రెమ్యూనిరేషన్ కావాలని డిమాండ్ చేసిందట కత్రినా.
ఈ కారణంగా వీరిద్దరి మధ్య గొడవ జరిగిందట.ఈ కారణంగా షూటింగ్ జరిగేటప్పుడు సరిగా కోపరేట్ చేసేది కాదట కత్రినా.
చివరకు ఆమె అడిగినంత రెమ్యూనిరేషన్ ఇచ్చారట మేకర్స్.ఈ కారణంగా వీళ్ళ మధ్య పెద్ద గూడవే జరిగిందని టాక్.
"""/" /
వెంకటేష్ తో వివాదంలో పడ్డ మరో హీరోయిన్ నిత్యా మీనన్( Nithya Menon ).
వెంకటేష్ తో నటించే అవకాశం వచ్చినప్పుడు నిత్యా, అంకుల్ తో నేను నటించను అని దురుసుగా సమాధానం ఇచ్చారట.
ఈ కారణంగా వీరి మధ్య దూరం ఏర్పడింది.ఆమె మాటలకూ వెంకటేష్ బాగా ఫీల్ అయ్యారట.
వెంకటేష్, రమ్య కృష్ణల మధ్య కూడా ఒక సమస్య ఉంది.వీళిద్దరి కంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి.
ఒక సినిమా షూటింగ్ టైం లో వీళ్లిద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందట.
ఐతే తరువాత ఇద్దరు సర్దుకొని, ఆ గొడవను మర్చిపోయి ఇప్పటికి మంచి స్నేహితులుగా ఉన్నారట.