Venkatesh Netha : లోక్ సభ సభ్యత్వానికి వెంకటేష్ నేత రాజీనామా..!

లోక్ సభ సభ్యత్వానికి వెంకటేశ్ నేత( Venkatesh Netha ) రాజీనామా చేశారు.

బీఆర్ఎస్ ను వీడిన ఆయన నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఎంపీ పదవికి రాజీనామా చేసిన వెంకటేశ్ నేత పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల వలన బీఆర్ఎస్ కు( Peddapalli Assembly Constituency ) రాజీనామా చేశానని పేర్కొన్నారు.

"""/" / బీఆర్ఎస్( BRS ) అంతర్గతంగా బీజేపీతో ఒప్పందానికి రావడ తనను బాధించిందని తెలిపారు.

ఈ క్రమంలో సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని భావించి హస్తం పార్టీలో చేరానని ఆయన వెల్లడించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధిస్తుందని తెలిపారు.

తెలుగు రాష్ట్రాలకు తన వంతు సహాయం చేసిన సాయితేజ్.. సాయం ఎంతంటే?