మీకు తెలుసా.. నారప్పకు పెట్టింది ఎంత? వచ్చింది ఎంత?

వెంకటేష్ హీరోగా రూపొందిన నారప్ప సినిమా ను విడుదలకు సిద్దం చేశారు.గత ఏడాదిలోనే ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది.

ఈ ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలనుకుని కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

కాని సినిమా విడుదలకు మళ్లీ కరోనా సెకండ్‌ వేవ్‌ రూపంలో అడ్డు పడింది.

దాంతో నారప్ప సినిమా ను సురేష్ బాబు ఓటీటీ విడుదలకు సిద్దం అయ్యారు.

మొదట నారప్ప సినిమా ను కేవలం థియేటర్‌ రిలీజ్ మాత్రమే అనుకున్నాడు.కాని ఆయన స్వయంగా ఈ సినిమా ను ఓటీటీ కి విడుదల చేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పడంతో ఇంకో నిర్మాత అయిన కళై పులి ఎస్‌ థాను కూడా ఒప్పుకున్నాడు.

అభిమానులు నారప్ప ను థియేటర్‌ లోనే చూడాలనుకుంటున్నట్లుగా వాదిస్తున్నా కూడా సురేష్‌ బాబు మాత్రం ఆ పని కానిచ్చేశారు.

అమెజాన్ వారు నారప్ప సినిమా విడుదల తేదీని ప్రకటించారు.ఈనెల లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నారప్ప సినిమా ను చాలా తక్కువ రోజుల్లోనే చిత్రీకరించారు.

ఈ సినిమా ఒరిజినల్‌ వర్షన్‌ అసురన్‌ కు మార్పులు చేర్పులు లేకుండా చిత్రీకరించడం వల్ల తక్కువ సమయంలోనే షూటింగ్‌ పూర్తి అయ్యింది.

శ్రీకాంత్ అడ్డాలను ఈ సినిమాకు దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు.ఆయన పెద్దగా క్రియేటివిటీ ఏమీ చూపించకుండా ఉన్నది ఉన్నట్లుగా కాపీ పేస్ట్‌ చేశాడు.

దాంతో సినిమా కేవలం 10 కోట్ల నిర్మాణ ఖర్చులతో ముగిసిందట. """/"/ వెంకటేష్‌ పారితోషికం తీసుకోకుండా నిర్మాతగా ఉండటం వల్ల నారప్ప సినిమా ఖర్చు చాలా తగ్గింది.

ఇక పది కోట్లతోనే పూర్తి అయిన నారప్పను ఏకంగా 40 కోట్లకు గాను అమెజాన్ వారు కొనుగోలు చేశారంటూ టాక్‌ వినిపిస్తుంది.

థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసి ఉంటే వెంకీ లుక్ కు అభిమానులు థియేటర్లకు వచ్చే వారు కాదు.

ఒక వేళ సక్సెస్ అయినా కూడా అంతగా వస్తుందనే నమ్మకం లేదు.కనుక ఓటీటీకి నారప్పను ఇచ్చేశారు.

మరో పది కోట్లు శాటిలైట్‌ ద్వారా వస్తే రౌండ్ ఫిగర్‌ 50 కోట్లు నారప్ప దక్కించుకున్నట్లు అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

ఇందులో 20 కోట్ల వరకు వెంకీ కి అందే అవకాశం ఉంది.

బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేయడం పుష్ప2 కు సాధ్యమేనా.. బన్నీ రేంజ్ డిసైడ్ కానుందా?