అయ్యో... వెంకటేష్ సినిమా రానున్నా మరీ ఇంత డల్ గా పరిస్థితి ఉందేంటో!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అనగానే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ పేర్లు తప్పకుండా గుర్తొస్తాయి.

అంతటి స్టార్ డం దక్కించుకున్న వెంకటేష్ ఇప్పుడు సినిమాల ఎంపిక విషయంలో చేసిన సినిమాల విడుదల విషయంలో అభిమానులను తీవ్రంగా నిరాశ పరుచుతున్నాడు.

తాజాగా విశ్వక్సేన్ తో కలిసి ఓరి దేవుడా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు వెంకటేష్ రెడీ అయిన విషయం తెలిసిందే.

రేపు విడుదల కాబోతున్న ఓరి దేవుడా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వెంకటేష్ కనిపించకపోవడంతో ఆయన అభిమానులు తీవ్రంగా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా లో ఆయన పాత్ర చాలా చిన్నది అవడం వల్లే ఆయన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం సినిమా పై ఆయనకి నమ్మకం లేదా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

మొత్తానికి హీరో వెంకటేష్ ఓరి దేవుడా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనక పోవడంపై సర్వత్ర చర్చ జరుగుతోంది.

ఈ సమయంలోనే వెంకటేష్ నటించిన సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలు ప్రమోషన్ ఈవెంట్స్ ఇలా డల్ గా సాగడం ఏమాత్రం సరిగా లేదని ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓరి దేవుడా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఒక మోస్తరుగా జరుగుతున్నా వెంకటేష్ గురించిన ప్రచారం మాత్రం పెద్దగా లేదనే చెప్పాలి.

ఒక సీనియర్ స్టార్ హీరోకు చిత్ర యూనిట్ సభ్యులు ఇస్తున్న గౌరవం ఇదేనా అంటూ కొందరు వెంకటేశ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా చిన్న హీరోతో మల్టీస్టారర్ సినిమా చేయడం కంటే ఒక స్టార్ హీరోతో మల్టీ స్టార్ సినిమా చేయడం బెటర్‌ అంటూ కొందరు వెంకటేష్ కి సలహా ఇస్తున్నారు.

ముందు ముందు అయినా వెంకటేష్ సినిమాలకు ఇలాంటి పరిస్థితి రావద్దు అని కోరుకుందాం.

ప్రపంచంలోనే హాటెస్ట్ అథ్లెట్.. ఈ ముద్దుగుమ్మ అందాలకు ఒలింపిక్ ఫ్యాన్స్ ఫిదా..?