మరో రీమేక్ సినిమాలో వెంకీ.. ఈసారి డైరెక్ట్ గా?

టాలీవుడ్ సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వెంకటేష్ నటించిన సినిమాలన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఈ క్రమంలోనే ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న వెంకటేష్ ఇప్పటికే వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే వెంకటేష్ నటించినటువంటి ఎఫ్2, వెంకీ మామ, నారప్ప వంటి చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

తాజాగా వెంకటేష్ నటించిన చిత్రం థియేటర్లో కాకుండాఓటీటీలో విడుదలయి మంచి టాక్ సంపాదించింది.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో అసురన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కినది.

ఈ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు దారుణంగా ఉండడంచేత నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.

ఇదిలా ఉండగా వెంకటేష్ తదుపరి చిత్రం దృశ్యం 2 రీమేక్ చిత్రం లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

"""/"/ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి హాట్ స్టార్ కొనుగోలు చేయాలని భావించింది.

అయితే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలు ఒప్పుకోలేదు.ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ సినిమాను డైరెక్ట్ గా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే దృశ్యం 2 సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13వ తేదీ థియేటర్లలో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే దసరా పండుగ కావడంతో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అఖండ, కొండ పొలం వంటి సినిమాలు కూడా దసరా రేస్ లో ఉండగా దృశ్యం 2 సినిమా కూడా పండుగ రేసులో మిగతా సినిమాలతో పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనప్పటికీ వెంకటేష్ ఈ రీమేక్ చిత్రాన్ని డైరెక్ట్ గా థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు.

దిశా కేసులో సిర్పూర్‎కర్ కమిషన్ నివేదికపై టీఎస్ హైకోర్టు స్టే