నారప్ప ఫస్ట్ లుక్.. అదిరిందప్ప!
TeluguStop.com
తమిళంలో సూపర్ హిట్ అయిన చిత్రం అసురన్‌ను తెలుగులో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రీమేక్ చేస్తున్నాడనే సంగతి తెలిసిందే.
ఇటీవల వెంకీ మామ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్న వెంకటేష్ మరోసారి రీమేక్ చిత్రాన్ని తనదైన మార్క్‌తో రెడీ చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
విక్టరీ వెంకటేష్ పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించే ఈ పోస్టర్ తమిళంలో ధనుష్ పోస్టర్‌న పోలి ఉంది.
అయినా వెంకటేష్ ఎక్స్‌ప్రెషన్స్ తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది.రివెంజ్ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమా రాయలసీమ యాసతో తెరకెక్కనున్నట్లు, అందుకే ఈ సినిమాకు ‘నారప్ప’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాతో మరసారి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు.
కాగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ప్రియమణి హీరోయిన్‌గా ఎంపికైంది.
ఈ సినిమాతో విక్టరీ వెంకటేష్ ఖచ్చితంగా ఆకట్టుకోవడమే కాకుండా సూపర్ హిట్ అందుకుంటాడని అందరూ ఆశిస్తున్నారు.
ఇక నారప్ప ఫస్ట్ లుక్ మాత్రం అదిరిందప్ప అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
డెలివరీ సమయంలో డాక్టర్ పాడు పని.. రూ.11 కోట్ల జరిమానా విధించిన కోర్టు!