‘రానా నాయుడు’ ఒక వృద్ధా ప్రయత్నం అంటూ వారి విమర్శలు
TeluguStop.com
వెంకటేష్, రానా కీలక పాత్రల్లో నటించిన రానా నాయుడు (rana Naidu)వెబ్ సిరీస్ ఇటీవలే నెట్ ప్లిస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఆమె సిరీస్ పై పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సఫలం అయ్యారు.
ఆలస్యం అవుతున్నా కొద్ది అంచనాలు పెరిగాయి.అయితే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయిన తర్వాత మాత్రం ప్రేక్షకులు విమర్శిస్తున్నారు.
స్వయంగా వెంకటేష్(venkatesh) మరియు రానా(rana) అభిమానులు కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
వెంకటేష్ నుండి ఇలాంటి సిరీస్ ని ఆశించలేదని చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్ ఒక వృధా ప్రయత్నం అంటూ చాలా మంది విమర్శిస్తున్నారు.
"""/" /
ఒక ఫ్యామిలీ హీరో ను బూతు హీరో గా చూపించాలని వారు చేసిన ప్రయత్నం విఫలమైంది.
వెబ్ సిరీస్ అనగానే బూతులు ఉండాలి.రొమాన్స్ ఉండాలని ఒక ఫార్మేట్ లోనే వాళ్ళు ఉండి పోయారు.
ఆ ఫార్మట్ తెలుగు ప్రేక్షకులకు నచ్చదని మరో సారి నిరూపితమైంది.గతంలో ఎన్నో వెబ్ సిరీస్ లో హిందీ తో పాటు ఇతర భాషల్లో సక్సెస్ అయ్యాయి.
కానీ తెలుగు లో మాత్రం అవి సక్సెస్ కాలేక పోయాయి.దాంతో అయినా వారికి అర్థమవ్వాల్సి ఉంది.
"""/" /ఇప్పటి వరకు తెలుగు లో అడల్ట్ కంటెంట్ తో వచ్చిన ఏ ఒక్క వెబ్ సిరీస్ కూడా సక్సెస్ కాలేదు.
ఆ విషయం రానా నాయుడు మేకర్స్ కి తెలియనిది కాదు.అయినా కూడా వెంకటేష్ తో చేసిన ప్రయత్నం ఏమాత్రం సఫలం కాలేదు.
రాజమౌళి వంటి ఫిలిం మేకర్స్ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న ఈ సమయం లో మన హీరోలు బూతు సినిమాలు చేస్తూ పరువు తీయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని తెలుగు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.