‘కస్టడీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అండ్ వెన్యూ డిటైల్స్ ఇవే!

అక్కినేని యంగ్ హీరోల్లో నాగ చైతన్య ( Naga Chaitanya ) ఒకరు.

ఈయన వరుస హిట్స్ అందుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే గత ఏడాది మాత్రం ఈయనకు కలిసి రాలేదనే చెప్పాలి.

థాంక్యూ, లాల్ సింగ్ చద్దా వంటి రెండు సినిమాలతో ప్లాప్ అందుకున్న చైతూ రేసులో వెనుక బడ్డాడు.

టైర్ 2 హీరోల్లో ఈయన వెనుక బడడంతో ఇప్పుడు నెక్స్ట్ ఆచితూచి సినిమాను ఎంచుకుని చేస్తున్నాడు.

"""/" / ప్రజెంట్ నాగ చైతన్య చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'కస్టడీ' ( Custody ).

నాగ చైతన్య కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కుతున్న ''కస్టడీ'' తమిళ్, తెలుగు ద్విభాషా భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది.

తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ( Venkat Prabhu ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య కు జోడీగా కృతి శెట్టి ( Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాకు నిర్మాతలు కూడా భారీగానే బడ్జెట్ పెడుతున్నారు. """/" / ఈ సినిమాలో నాగ చైతన్య ఫుల్ లెన్త్ పోలీస్ రోల్ లో నటిస్తున్నాడు.

ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఒక్కోటిగా రిలీజ్ అవుతూ ఆకట్టు కుంటుండగా.

తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి.

"""/" / ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ( Custody Pre-Release Event) కు టైం అండ్ డేట్ ఫిక్స్ చేసారు.

కస్టడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మే 7న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో ఫ్లోర్ లో సాయంత్రం 6 గంటల నుండి గ్రాండ్ గా జరిగింది.

ఈ మేరకు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.ఇక ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు సంగీతం అందిస్తున్నారు.

,అలాగే ఈ సినిమా మే 12న సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది.మరి చైతూ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.

పవన్ కళ్యాణ్ పెద్దగా ఈవెంట్స్ కి రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా..?