విలన్ పాత్రలను హీరోలుగా చూపించడం సరికాదు.. వెంకయ్య నాయుడు కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో హీరోలను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో చూపించడం జరుగుతోంది.

కేజీఎఫ్, పుష్ప ది రూల్ సినిమా( KGF, Pushpa The Rule Movie ) అలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి.

అయితే విలన్ పాత్రలను హీరోలుగా చూపించడం విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సీనియర్ నటి, కృష్ణవేణి ( Krishnaveni )సంస్మరణ సభలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

ప్రస్తుతం సినిమా సంభాషణలలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టడం పరిపాటిగా మారిపోయిందని కొత్తగా రచనలు చేసేవాళ్లకు నేనిచ్చే సలహా ఒకటేనని ఆయన అన్నారు.

అర్థవంతమైన సంభాషణలు రాస్తే చాలని ద్వంద్వార్థాలు పెట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.అప్పట్లో వచ్చిన పాతాళ భైరవి, మిస్సమ్మ, సీతారామయ్య గారి మనవరాలు సినిమాలు రామోజీరావు నిర్మించిన సినిమాలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.

"""/" / ఈతరం కూడా ఆ సినిమాల గురించి గొప్పగా చెప్పుకుంటారని వెంకయ్య నాయుడు ( Venkaiah Naidu )కామెంట్లు చేశారు.

ప్రస్తుతం ప్రతినాయక పాత్రలనే హీరోలుగా మారుస్తున్న ధోరణి పెరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.అది హీరోయిజం అనిపించుకోదని ఆయన వెల్లడించారు.

సినిమాల విషయంలో మంచి ప్రమాణాలు పాటించాలని హాస్యంలోనూ అశ్లీలత దొర్లకుండా చూసుకోవాలని ఆయన తెలిపారు.

"""/" / సినిమాలకు సంబంధించి వెంకయ్య నాయుడు చేసిన కామెంట్లు నిజమేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కామెంట్ల గురించి హీరోలు, దర్శకుల నుంచి రియాక్షన్ వస్తుందేమో చూడాల్సి ఉంది.

సినిమాలకు సంబంధించి ఈ సంస్కృతి మారాల్సి ఉంది.ప్రేక్షకులు సైతం ఈ తరహా సినిమాలపై ఆసక్తి చూపకుండా ఉంటే మంచిది.

భవిష్యత్తులో సైతం హీరోలను ప్రతినాయక పాత్రల్లో సినిమాల్లో చూపిస్తే చర్యలు తీసుకునేలా ఏవైనా రూల్స్ ను తెస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ దిశగా అడుగులు పడితే మాత్రం బాగుంటుందని చెప్పవచ్చు.