వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: గురువారం రోజున వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసి రాజన్న దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తుల, వాహనాలు వేములవాడకి వస్తుంటాయని,వాటిని దృష్టిలో ఉంచుకోని ట్రాఫిక్ అంతరాయం కల్గకుండా పకడ్బందీగా ట్రాఫిక్ క్రమబద్ధీకారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
స్టేషన్ పరిధిలోని నాంపల్లి, నందికమాన్, తిప్పాపూర్ బస్టాండ్, కోరుట్ల బస్టాండ్ వంటి కొన్ని ముఖ్య ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యల పై నా దృష్టికి రావడం జరిగిందని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు,పట్టణ పరిధిలో పలు జంక్షన్ లలో ఉన్న రోడ్డు సంబంధిత ఇబ్బందులను ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని,ఆయా ప్రాంతాల్లో అందరితో కలిసి ముందుకు వెళ్లి ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేయడం జరుగుతుదని,ప్రస్తుతం ఆర్.
ఎస్.ఐ రాజు ఆధ్వర్యంలో కొత్తగా సిబ్బందిని కేటాయించి ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
స్టేషన్ పరిధిలో పకడ్బందీగా విసిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టిపెట్టి క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేస్తూ వేములవాడ పట్టణ పరిధిలో స్పెషల్ టీం ఏర్పాటు చేయడంతో పాటు 5మందితో యాక్షన్ టీం ఏర్పాటు చేయడం జరిగింది.
ఇందులో భాగంగా పట్టణ పరిధిలో 12 లోకేషన్లు గుర్తించి ప్రతి గంటకు ఒకసారి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తూ నిరంతరం భద్రత చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు.
పట్టణ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ,రౌడీ షీటర్లు మరియు హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు.
ఎస్పీ వెంట పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్ ఐ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా లో సక్సెస్ సాధిస్తాడా..?