సిఈఐఆర్ టెక్నాలజీతో పోయిన ఫోన్ ని స్వాధీనం చేసుకుని తిరిగి బాధితునికి అప్పగించిన వేములవాడ రూరల్ పోలీస్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ( Vemulawada ) రూరల్ మండలం పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను సీఈఐఆర్ ద్వారా కనుక్కొని, బాధితులకు తిరిగి అప్పగించిన వేములవాడ రూరల్ పోలీసులు.

ఈ సందర్బంగా ఎస్ ఐ మారుతీ( SI Maruti ) మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోయినట్టు అయితే సిఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) లో పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, తద్వారా కోల్పోయిన ఫోన్ ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

ఫోన్ దొరికిన వ్యక్తి దానిలో సిమ్ కార్డు వేసుకోవడంతో, ఈ వెబ్సైట్ ద్వారా అతని వివరాలతో కూడిన సమాచారం రాగానే ఫోన్ దొరికిన వ్యక్తి నుంచి ఫోన్ ను స్వాధీనం చేసుకుని, పోగొట్టుకున్న వ్యక్తి కి అందజేయడం జరుగుతుంది అని తెలిపారు, సిఈఐఆర్ ( CEIR Technology )ద్వారా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన అంజయ్య కి తన ఫోన్ అందించటం జరిగింది అని తెలిపారు.

బాధితుడు వేములవాడ రూరల్ పోలీస్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

మొటిమలు మచ్చలను పోగొట్టి ముఖాన్ని తెల్లగా మెరిపించే ఎఫెక్టివ్ రెమెడీ ఇది..!