వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు టికెట్ పై ధీమా!
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టికెట్ కోసం పోటీ పెరిగిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీలో క్రమశిక్షణతో విధానం అమలవుతుందని వ్యాఖ్యానించారు.బుధవారం వేములవాడ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.
ఈ సారి కూడా సిట్టింగులకే టికెట్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని తనకు టికెట్ వచ్చి తీరుతుందన్నారు.
అయితే పని తీరు బాగా లేని ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా పిలిపించుకుని మాట్లాడుతానని చెప్పారని అయితే తన పేరు మాత్రం పనితీరు బాగాలేని జాబితాలో లేదని తనను సీఎం పిలవలేదన్నారు.
ఈ విషయంలో తాను వెల్లి కూడా కలవలేదని చెన్నమనేని వ్యాఖ్యానించారు.తనకు టికెట్ వచ్చే అవకాశాలు లేవన్న విషయంపై కూడా స్పందించిన ఆయన తనను కాదని టికెట్ ఎవరికీ టికెట్ ఇవ్వరని దశాబ్ది ఉత్సవాల సంబరాలు జరుపుకుంటున్న సమయంలో టికెట్ గురించి మాట్లాడడం అపచారం అవుతుందని వ్యాఖ్యనించారు.
ప్రతి రెండు రోజుల కోసం మంత్రి కేటీఆర్ కూడా మొబైల్ కాన్ఫరెన్స్ తీసుకుంటు జన సమీకరణ ఎలా ఉంది.
ప్రజా స్పందన బావుందా అని ఆరా తీస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే వివరించారు.బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కల్గిన పార్టీ అని వేములవాడ ఇంఛార్జిగా తాను జిల్లా మంత్రి కేటీఆర్ వర్కింగ్ ప్రసిడెంట్ గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, పార్లమెంటరీ వ్యవహారాలు చూసేందుకు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య,
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లు పర్యవేక్షిస్తారని బీఆర్ఎస్ పరంగా ఎలాంటి కార్యక్రమం జరిగినా తామందరి ఆమోదంతో జరుగుతుందన్నారు.
ఇక వేరే ఎవరేం చేసుకున్నా కానీ వాళ్లిష్టం ఎవరిష్టం వచ్చినట్టుగా చేసుకుంటే మాకు సంబంధం లేదని రమేష్ బాబు స్పష్టం చేశారు.
టికెట్ గురించి అభ్యర్థులు మాట్లాడడం సరికాదన్న రీతిలో కామెంట్ చేశారు.మరో వైపున పట్టణంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు గురించి మాట్లాడిన ఎమ్మెల్యే తమ గుర్తు 100 బెడెడ్ ఆసుపత్రి అంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెడికల్ మాఫియా తయారైందని అలా వంద కోట్లు సంపాదించుకున్న వారు వేములవాడకు వచ్చారంటూ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.
ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లోనూ తనకే టికెట్ వస్తుందని ఎమ్మెల్యే రమేష్ బాబు కుండ బద్దలు కొట్టారు.
వాటే టాలెంట్ గురూ.. రైలులో రద్దీని తట్టుకోలేక అతడు ఏకంగా?