బిఎస్పి పార్టీకి రాజీనామా చేసిన వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోలిమోహన్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించిన వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోలి మోహన్( Dr Goli Mohan ) హైదరాబాదులో రాష్ట్ర కార్యాలయం లో తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షులు దయానంద్( Dayanand ) కి అందజేశారు.
ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ డాక్టర్ గోలి మోహన్ ఎంతో గొప్ప వ్యక్తి ఇలాంటి నాయకుడిని మేము కోల్పోవడం చాలా బాధాకరమని కానీ రాబోయే రోజుల్లో ఒకవేళ గోలి మోహన్ ఏదైనా సమయం ఇస్తే పార్టీకి సలహాలు గాని సూచనలు కావాలని మంచి గొప్ప నాయకున్ని కోల్పోతున్నామని వాళ్ళు బాధపడ్డారని తెలిపారు.
డాక్టర్ గోలిమోహన్ మాట్లాడుతూ నామీద ఎంతో నమ్మకంతోని వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ఇచ్చినందుకు రాష్ట్ర కార్యవర్గానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
నా యొక్క రాజీనామా పత్రాన్ని ఆమోదించినందుకు రాష్ట్ర అధ్యక్షులకు,రాష్ట్ర ఉపాధ్యక్షులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అని అన్నారు.
బీఎస్పీ పార్టీ నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రజలకు తీసుకపోయాను ప్రజలు కూడా అంతే ఆదరణతో పార్టీనీ ఆదరించారు.
కొన్ని అనీవార్య కారణాల వల్ల నేను పార్టీకి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను.కాబట్టి నా వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ శాశ్వత సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.
నా గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.నేను రాబోయే రోజుల్లో నా భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రజలకు తెలియజేస్తానని అంతేకాకుండా వేములవాడ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూన్న అన్నారు.
నేను ఏదైతే ప్రచారంలో చెప్పానో నాకు ఓట్ వేయకున్న పర్వాలేదు కానీ మీ పిల్లలు భవిష్యత్తు బాగు చేస్తా అని చెప్పాను అదేవిధంగా మీ పిల్లల భవిష్యత్తును రాబోయే రోజుల్లో వేములవాడ నియోజకవర్గంలోనీ అన్ని వర్గాల ప్రజల యొక్క కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ మీకు అందుబాటులో ఉంటానని తెలియజేశారు.
సాయి పల్లవికి కొత్త బిరుదు ఇచ్చిన చైతన్య.. ఏంటో తెలుసా?