Vel Sathriyan: నేషనల్ అవార్డు వస్తుందని 300 మంది అమ్మాయిలను వాడుకున్న తమిళనాడు వ్యక్తి
TeluguStop.com
రీసెంట్‌గా భారతీయ నటీనటులకు నేషనల్ అవార్డ్స్( National Awards ) ఇచ్చిన సంగతి తెలిసిందే.
మన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు అందుకోగా, అలియాభట్( Alia Bhatt ) బెస్ట్ యాక్టర్స్ అవార్డును సొంతం చేసుకుంది.
మిగతావారు కూడా ఆయా కేటగిరీలలో అవార్డ్స్ గెలుచుకున్నారు.అయితే ఈ అవార్డును ఏ అర్హతను బట్టి ఇస్తారు? ఎవరైనా ఒక వ్యక్తి చెప్తే ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా కానీ ఇస్తారని తమిళనాడుకు చెందిన కొందరు నమ్మేశారు.
ఈ అవార్డులు వచ్చేలాగా తాను చేస్తానని ఇటీవల ఒక తమిళనాడు మోసగాడు 300 మంది అమ్మాయిలను మోసం చేశాడు.
అతని పేరు 'వేల్ సత్రియన్'(Vel Sathriyan), వయసు 38, స్వస్థలం సేలం.కొన్ని నెలల క్రితం 'పొట్టాచ్చి' మూవీ తానే ప్రొడ్యూస్ చేసి, తానే డైరెక్ట్ చేస్తానంటూ ఇతడు క్యాంపెనింగ్ చేశాడు.
ఈ మూవీ నిర్మాణం కోసం నోబెల్ క్రియేషన్స్( Noble Creations ) పేరుతో ఒక ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించి, ఓ ఆఫీసు ఏర్పాటు చేశాడు.
తాను తీయబోయే మూవీకి 'హీరోయిన్' కావాలని న్యూస్ పేపర్స్, సోషల్ మీడియా సైట్స్‌లో ప్రకటనలు ఇచ్చాడు.
అది నిజమే అనుకుని 400 అమ్మాయిలు అప్లై చేసుకున్నారు.వారిలో ఒక్కోసారి కొంతమందిని పిలుస్తూ వారితో మంచిగా మాటలు కలుపుతూ వేల్ సత్రియన్ నమ్మకం పెంచుకున్నాడు.
ఈ మోసగాడి పక్కన అసిస్టెంట్ బాలజ్యోతి( Balajyothi ) కూడా ఉండేది.దీంతో చాలామంది అమ్మాయిలు అతడు నిజమైన నిర్మాత, డైరెక్టర్ అని అనుకున్నారు.
ఆ నమ్మకం కలిగిన తర్వాత వేల్ నటన పేరుతో అమ్మాయిలను ముద్దు పెట్టుకోవడం, ఎక్కడపడితే అక్కడ తాకడం, హగ్ చేసుకోవడం చేసేవాడు.
వాటిని వీడియో కూడా తీసేవాడు.ఇదేం తీరు అని ప్రశ్నిస్తే తాను రూపొందించే మూవీలో యాక్టింగ్ ఇలాగే రియలిస్టిక్‌గా ఉంటుందని, చెప్పినట్టు చేస్తే నేషనల్ అవార్డు కూడా వస్తుందని నమ్మబలికాడు.
నేషనల్ అవార్డుకూ, ఈ రొమాంటిక్ సీన్లకు లింక్ ఏంటి అని అడిగితే ఏదో సర్ది చెప్పి వారితో అలానే అసభ్యంగా ప్రవర్తించడం కొనసాగించాడు.
"""/" /
కొద్ది రోజుల తర్వాత వారితో గడిపిన రొమాంటిక్ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్( Black Mail ) చేయడం మొదలుపెట్టాడు.
డబ్బు ఇవ్వాలని లేదంటే, వీడియోలు లీక్ చేస్తానని బాగా టార్చర్ చేసేవాడు.కొందర్ని బలవంతపెట్టి న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసేవాడు .
దాదాపు 30 రోజులపాటు 300 మంది అమ్మాయిలు ఇలాంటి నరకాన్ని వాళ్లు అనుభవించారు.
పరువు పోతుందేమోనని వారు ఎలాంటి ధైర్యం చేయలేకపోయారు.కానీ అతడి పాపం పండే రోజు రానే వచ్చింది.
2022లో ఒక అమ్మాయి సినిమా అవకాశం( Movie Offers ) కోసం వేల్ సత్రియన్ వద్దకు వెళ్లింది.
రూ.30 వేలు ఇస్తే సినిమాలో నటించే ఆఫర్ ఇస్తానని ఆ మోసగాడు అన్నాడు.
అంత డబ్బులు తాను ఇచ్చుకోలేనని ఆమె చెప్పడంతో తన వద్ద పని మనిషిగా చేరి డబ్బు సంపాదించవచ్చని చెప్పాడు.
దాంతో ఆమె పనిమనిషిగా చేరింది అయితే పని చేసినందుకు డబ్బులు ఇవ్వలేదు. """/" /
దాంతో బాగా నిరాశ పడిన ఆమె ఎలాగైనా తన శ్రమకు తగిన అమౌంట్ తీసుకోవాలనుకుంది.
అదే సమయంలో ఆఫీసులోని ఫైల్స్, ఇతర డేటా చూస్తూ ఉన్నప్పుడు మోసపోయిన అమ్మాయిల ఫొటోలు, నగ్న వీడియోలు కనిపించాయి.
దాంతో షాక్ తిన్నది.అనంతరం నేరుగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.
ఆ విధంగా వేల్ సత్రియన్ గుట్టు రట్టయింది.పోలీసులు అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.
అతడి అసిస్టెంట్‌గా ఉన్న బాలజ్యోతి కూడా ఈ మోసంలో భాగం కలిగి ఉందా లేదంటే ఆమె కూడా అతని వల్ల జీవితం పాడు చేసుకున్న ఒక అభాగ్యురాలా అనేది తెలుసుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
నేషనల్ అవార్డు ఇప్పిస్తానని అతడు చెప్పడం, వీరు నమ్మడం చాలా విడ్డూరంగా ఉందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.
పని మొదలు పెట్టిన జియోస్టార్.. రూ. 15ల నుంచే ఎంటర్టైన్మెంట్ షురూ